Anasuya: అనసూయ జబర్దస్త్ కి దూరం కాబోతుందా… అసలు మేటర్ ఏంటి?

అనసూయ.. పరిచయం అవసరం లేని పేరు. ఈమె గ్లామర్ గురించి… క్రేజ్ గురించి వర్ణించడానికి ఎంత టైం తీసుకున్నా తక్కువే. ఇప్పుడున్న స్టార్ యాంకర్స్ లో భీభత్సమైన క్రేజ్ ఉన్న యాంకర్ అనగానే తక్కువ ఈమె పేరే చెప్పొచ్చు. తరచూ ఈమె గురించి వార్తలు వస్తుంటాయి. అంత పాపులర్ ఈమె..! కెరీర్ ప్రారంభంలో న్యూస్ ప్రెజెంటర్ గా పనిచేసిన అనసూయ ‘జబర్దస్త్’ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత భీభత్సమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమె ‘జబర్దస్త్’ ను హోస్ట్ చేస్తూనే ఉంది.

ఈ షోలో స్కిట్ లతో పాటు ఆమె గ్లామర్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే ఈ 9 ఏళ్లలో అనసూయ ‘జబర్దస్త్’ ను మాత్రం వదల్లేదు. మధ్యలో ఒకసారి ఈమె ‘జబర్దస్త్’ కు దూరమైనా కొన్ని నెలల తర్వాత మళ్ళీ వెంటనే వచ్చేసింది. అనసూయ ఇప్పుడు సినిమాల్లో బిజీగా రాణిస్తుంది అన్నా.. ఆమెకు బోలెడంత క్రేజ్ ఉంది అన్నా అది ‘జబర్దస్త్’ వల్లే అని చెప్పడంలో సందేహం లేదు.

అయితే ఇప్పుడు అనసూయ ‘జబర్దస్త్’ కు గుడ్ బై చెప్పబోతోంది అనే వార్త సోషల్ మీడియాలో ఊపందుకుంది. అందుకు అనసూయ పెట్టిన ఓ ఎమోషనల్ పోస్ట్ అని తెలుస్తుంది. “నా కెరీర్ లో నేను చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాను. చాలా మెమొరీస్ నాతో తీసుకువెళుతున్నాను. అందులో ఎక్కువ మంచి మెమొరీసే ఉన్నాయి. కొన్ని బ్యాడ్ మెమొరీస్ కూడా ఉన్నాయి. ఎప్పటిలాగే మీ ఆదరణ నాకు ఉంటుందని భావిస్తున్నాను” అంటూ తన అనసూయ ఇన్స్టాగ్రామ్ లో పేర్కొంది అనసూయ.

ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. సినిమాల్లో అనసూయకి మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ‘జబర్దస్త్’ కారణంగా కొన్ని సినిమా ఆఫర్లను ఆమె మిస్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అని ఇన్సైడ్ టాక్. అందుకే ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది అని కొందరు అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus