‘కప్పెల’ రీమేక్ లో అనిఖ!

లాక్ డౌన్ టైమ్ లో మంచి సక్సెస్ అందుకున్న చిత్రాలలో మలయాళ సినిమా ‘కప్పెల’ ఒకటి. దీనికి హిట్ టాక్ రావడంతో వెంటనే రీమేక్ హక్కులను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. సినిమాలో రెండు కీలకమైన పాత్రలు ఉండగా.. ముందుగా ఒక పాత్ర కోసం విశ్వక్ సేన్ ను తీసుకున్నారు. మరో పాత్రలో ‘అరవింద సమేత’, ‘భానుమతి రామకృష్ణ’ వంటి సినిమాలతో మెప్పించిన హీరో నవీన్ చంద్రను తీసుకుంటున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా అనిఖను ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన అనిఖ బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఆమె తమిళ, మలయాళ చిత్రాల్లోనే నటించినప్పటికీ.. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. ‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’ వంటి సినిమాల్లో అజిత్ కూతురిగా కనిపించింది అనిఖ. టీనేజర్ అయిన ఈమె ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అది కూడా తెలుగు సినిమాతో.

పదహారేళ్ల అనిఖను ‘కప్పెల’ తెలుగు రీమేక్ కోసం తీసుకుంటున్నారట. ఇప్పటికే స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. దాదాపు ఈమెనే ఫైనల్ చేసే ఛాన్స్ ఉందట. కథ ప్రకారం యంగ్ అండ్ ఫ్రెష్ ఫేస్ అయితే బాగుంటుందని అనిఖను తీసుకుంటున్నారు. నిజానికి ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా ‘ఉప్పెన’ భామ కృతిశెట్టిని అనుకున్నారు. కానీ ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతుండడంతో అనిఖను తీసుకున్నారట.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35


Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus