Anitha Chowdary: క్యాస్ట్ ఫీలింగ్ పై అనితా చౌదరి షాకింగ్ కామెంట్స్..?

దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం సినిమాలు, సీరియళ్లలో నటిగా టీవీ షోలలో యాంకర్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూ అనితా చౌదరి గుర్తింపును సంపాదించుకున్నారు. నువ్వే నువ్వే, మన్మథుడు, ఛత్రపతి సినిమాల్లోని పాత్రలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఝాన్సీ, ఉదయభాను, సుమ, మరికొందరు యాంకర్లకు గట్టి పోటీని ఇచ్చిన యాంకర్లలో ఒకరైన అనితా చౌదరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ గురించి మాట్లాడిన అనితా చౌదరి ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్పుకొచ్చారు.

తనకు సుమ, ఝాన్సీ ఎక్కువగా క్లోజ్ అని అనితా చౌదరి తెలిపారు. ఉదయభాను బోల్డ్ అని తను అంటే చాలా ఇష్టమని అనితా చౌదరి వెల్లడించారు. తన పేరులో చౌదరి ఉన్నా తనతో కుక్క చాకిరి చేయించారని యాక్టర్ కు తక్కువ ఆఫీస్ బాయ్ కు ఎక్కువ అనేలా తన పరిస్థితి ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు. నా ఫస్ట్ సీరియల్ కు అనితా చౌదరి అని వేయడంతో తరువాత అదే పేరు కంటిన్యూ అయిందని ఆమె వెల్లడించారు.

తనకు సన్నిహితంగా ఉండే సుమ, సునీత తన క్యాస్ట్ కాకపోయినా తాము సన్నిహితంగా ఉంటామని అనితా చౌదరి చెప్పుకొచ్చారు. తాను నాగేశ్వరరావు గారితో, నాగార్జున గారితో, నాగచైతన్య గారితో నటించానని అనితా చౌదరి పేర్కొన్నారు. తాను ప్రతిభ వల్లే పైకి వచ్చానని కులం వల్ల కాదని అనితా చౌదరి తెలిపారు.


ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus