Anupama: అనుపమ పరమేశ్వరన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారా… వైరల్ అవుతున్న పోస్ట్!

ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగు తమిళ భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో మంచి సక్సెస్ సాధించారు.ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే అనుపమ గత కొద్ది రోజుల క్రితం వరకు తన వ్యక్తిగత విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలిచారు.

ఈమె ప్రముఖ క్రికెట్ తో ప్రేమలో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే సదరు క్రికెటర్ తన ప్రేయసిని పెళ్లి చేసుకోవడంతో ఈమె గురించి వచ్చే వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది.ఇలా తన వ్యక్తిగత విషయాల వల్ల కూడా అనుపమ పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉండగా తాజాగా అనుపమ సోషల్ మీడియా వేదికగా ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ ఒక పోస్ట్ చేశారు. ఇది చూసినటువంటి నెటిజెన్స్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి అనుపమ పరమేశ్వరన్ నిశ్చితార్థం చేసుకున్నారా..

లేక చేసుకోబోతున్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈమె ఒక ప్లాస్టిక్ కవర్ ను తన వేలికి ఉంగరంలా చుట్టుకొని ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ పోస్ట్ చేశారు. ఇలా ఈ పోస్ట్ చేయడంతో అందరూ కూడా ఈమె పెళ్లి చేసుకోబోతున్నారా అందుకే ఇలా అందరికీ హింటిస్తున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే అనుపమ మాత్రం సరదాగా ఈ పోస్ట్ చేశారని అర్థమవుతున్నప్పటికీ కొందరు మాత్రం ఈ పోస్ట్ పై స్పందిస్తూ అమ్మడికి పెళ్లి పై గాలి మళ్ళిందేమో అందుకే ఇలా ఎంగేజ్మెంట్ అంటూ ఇలాంటి పోస్ట్ షేర్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus