సినిమా ప్రపంచంలో అందరి జీవితాలు ఒకే తరహాలో ఉండవు. ఎంతో స్టార్ హోదా ను చూసిన వారు కూడా చాలా తక్కువ సమయంలోనే ఒక్కసారిగా పాతాళానికి పడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటీవల ఒక హీరోయిన్ కు ఏమైందో ఏమో కానీ ఏకంగా దొంగతనానికి పాల్పడడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే గతంలో కూడా ఆ బ్యూటీ పలు వివాదాస్పద విషయాలతో వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆ దొంగతనం ఏమిటి అనే వివరాల్లోకి వెళితే..
బెంగాలీ చిత్ర పరిశ్రమలో ఓ చిన్నపాటి నటిగా రూపాదత్త తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. అయితే ఆమె పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. దొంగతనం చేసినట్లుగా కోల్కతాలో పోలీసు కేసు నమోదయ్యింది. ఇక వెంటనే పోలీసులు ఆమెను అరెస్టు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆమె పిక్ పాకెట్ చేసినట్లు కేసులో పేర్కొన్నారు. అయితే ఆమె పోలీసులకు రెడ్ హ్యండెడ్ గా దొరికిపోవడం విశేషం.
ఒక హ్యాండ్ బ్యాగ్ చెత్త కుండీలో పడేస్తుండగా కొందరు లోకల్ పోలీసులు గమనించారు. ఖరీదైన బ్యాగ్ ని అలా ఎందుకు పడేస్తుంది అని అనుమానంతో ఆరా తీయగా అందులో చాలా పర్సలు బయటపడ్డాయి. ఇక వెంటనే పోలీసులు అనుమానంతో ఆమెను పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లి అసలు విషయం బయట పెట్టేందుకు విచారించారు.. ఆమె ఒక బుక్ ఫెస్టివల్ లో ఆ పర్సలను అన్నిటిని కూడా దొంగతనం చేసినట్లు తెలిసింది.
అయితే మొదట ఆమె నటిని కాదు అని చెప్పుకొచ్చింది కానీ తర్వాత పోలీసులు ఆమె బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకుని ఆమె సినిమా నటి అని తెలుసుకొన్నారు. పిక్ పాకేటింగ్ కేసులో అరెస్టయిన ట్లుగా అసలు విషయం బయటపడింది. దాదాపు రూప నుంచి 75 వేల రూపాయల వరకు పోలీసులు రికవరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ బ్యూటీ గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది ప్రముఖులపై కూడా లైంగిక ఆరోపణలు చేసింది.