దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఆయన లైఫ్ స్టైల్ చాలా లగ్జరీగా ఉంటుందని, అందుకే ఎక్కడికి వెళ్లినా ప్రైవేట్ జెట్ లోనే వెళ్తారని అందరూ అనుకుంటారు. కానీ దీని వెనుక అసలు కారణం వేరే ఉందట. బయట అందరూ అనుకుంటున్నట్లు అది లగ్జరీ కోసమో, దర్పం కోసమో కాదని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రభాస్ అలా ప్రత్యేక విమానంలో వెళ్లడానికి వెనుక ఒక బలమైన కారణం ఉంది.
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది స్టార్లకు సొంత విమానాలు ఉన్నాయి. చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్ లాంటి వారు కూడా అప్పుడప్పుడు కమర్షియల్ ఫ్లైట్స్ లో కనిపిస్తుంటారు. కానీ ప్రభాస్ మాత్రం పబ్లిక్ ట్రావెల్ ను పూర్తిగా ఎవాయిడ్ చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఆయన ప్రస్తుతం చేస్తున్న భారీ ప్రాజెక్టులే. స్పిరిట్, రాజా సాబ్, సలార్ 2 లాంటి సినిమాల్లో ఆయన లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నాయి.
ఆయా సినిమాల లుక్స్ రిలీజ్ కు ముందే బయటకు రాకూడదని మేకర్స్ భావిస్తుంటారు. గతంలో ప్రభాస్ ఎయిర్ పోర్ట్ లో కనిపించినప్పుడు తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవి కాస్తా వైరల్ అయ్యి, అనవసరమైన ట్రోలింగ్ కు దారితీశాయి. లుక్ విషయంలో క్లారిటీ లేకుండా బయటకు వస్తే ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారు. అందుకే ఇలాంటి సమస్యలు రాకుండా, తన సినిమా లుక్స్ ను సీక్రెట్ గా ఉంచడానికే ప్రభాస్ ప్రైవేట్ జెట్ ను ఆశ్రయిస్తున్నారట.
పబ్లిక్ కంట పడకుండా, నేరుగా షూటింగ్ స్పాట్ కు లేదా ఇంటికి వెళ్లడానికి ఇది సేఫ్ ఆప్షన్ గా భావిస్తున్నారు. అంటే ఆ లగ్జరీ వెనుక ఉన్నది ఎంజాయ్ మెంట్ కాదు, ఒక రకమైన ప్రొఫెషనల్ జాగ్రత్త అన్నమాట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ప్రయాణ ఖర్చుల విషయంలో ప్రభాస్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. సినిమా పని మీద వెళ్తే ఓకే కానీ, పర్సనల్ పని మీద వెళ్తే మాత్రం ఆ ఖర్చు మొత్తం ఆయనే భరిస్తారు. నిర్మాతల మీద అస్సలు భారం వేయరు. తన వల్ల నిర్మాతకు ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చు కాకూడదని కోరుకుంటారు.
