Bhanumathi: భానుమతి ఆ సినిమాలు చేసుంటే ఆమె కెరియర్ ఓ రేంజ్ లో ఉండేది..!

అలనాటి స్టార్ హీరోయిన్ భానుమతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆమె ముక్కు సూటితనం, ఆత్మవిశ్వాసం, నిండైన కట్టు, బొట్టు ఆమె వ్యక్తిత్వాన్ని మరో మెట్టు పైకెక్కిచ్చాయి. కానీ అవే ఆమెకు రావాల్సినంత పేరు తీసుకురాలేదంటారు అప్పటి తరం వారు.మరీ ముక్కు సూటిగా ఉంటే సినిమా పరిశ్రమకు సరిపోరు అంటూ ఉంటారు. అమె ముక్కసూటి తనమే కొన్ని సినిమాలకు దూరం చేసిదని అంటున్నారు. ఆమె ఎంత అభిన‌యం చేస్తారో.. ఎంత టాలెంట్ ప్ర‌ద‌ర్శిస్తారో.. అంతే ఈగో ఫీల‌య్యేవార‌ట‌.

త‌నంత న‌టి లేద‌నే భావ‌న ఆమెలో స్ప‌ష్టంగా క‌నిపించేద‌ని ఎందరో అనేవారు. ఇది.. కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో ఆమెకు మేలు చేయ‌క‌పోగా.. కీడునే చేసింద‌ని చెబుతారు. కీల‌క‌మైన సినిమాల్లో భానుమ‌తిని త‌ప్పించేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. మిస్స‌మ్మ సినిమా సూప‌ర్ హిట్‌. త‌మిళంలోనూ తెలుగులోనూ 360 రోజులు ఆడిన సినిమా ఇది. దీనిలో తొలి అవ‌కాశం భానుమ‌తిదే. కానీ, ద‌ర్శ‌కుడికి ఆమెకు పొస‌గ‌లేదు. దీంతో వెంట‌నే ఆమెను త‌ప్పించి.. సావిత్రిని ఎంపిక చేసుకున్నారు.

ఇక‌, ద‌ర్శ‌కుడు దాస‌రి నారాయ‌ణ‌రావు తీసిన తొలి చిత్రం తాతా-మ‌న‌వ‌డు. ఇది ఎవ‌గ్రీన్ చిత్రం. దీనిలో అప్ప‌టి హాస్య ర‌త్నం.. రాజ‌బాబు హీరో. ఇక్క‌డ కూడా భానుమ‌తి ఓ అవ‌కాశం వ‌దిలేసుకున్నారు. ముందు భానుమ‌తిగారినే అనుకున్నాం. కానీ, ఆవిడ ఈ పాత్ర చేసేందుకు ఫీల‌య్యారు. నేను చేస్తే బాగుంటుందా.. నారాయ‌ణ‌రావ్‌? అని ప్ర‌శ్నించారు. నాకు కొంచెం బాధ క‌లిగింది. ఒక పాత్ర‌కు న‌టిని ఎంచుకున్నాకే.. వారు న్యాయం చేస్తార‌ని అనుకున్నాకే.. సంప్ర‌దిస్తాం. అడ్వాన్స్ ఇస్తాం.

కానీ, ఆమె తీరా అన్నీ రెడీ చేసుకున్నాక‌.. బాగుంటుందా? పేరు వ‌స్తుందా? అని అనుమానాలు వ్య‌క్తం చేయ‌డంతో ఎందుకో నిర్మాత‌లు ఒప్పుకోలేదు. దీంతో అంజ‌లీ అమ్మ‌ను అడ‌గ‌గానే ఒప్పేసుకున్నారు అని దాస‌రి ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చారు. అంతేకాదు.. యుగంధ‌ర్ సినిమాలో ఎన్టీఆర్ త‌ల్లిపాత్ర‌కు కూడా భానుమ‌తిని సంప్ర‌దించిన‌ట్టు దాస‌రి చెప్పారు. అయితే.. ఎన్నోసినిమాల్లో ఎన్టీఆర్‌కు భార్య‌గా , ప్రేమికురాలిగా న‌టించిన త‌ను త‌ల్లి పాత్ర‌లు వేయ‌డం ఏంట‌ని అన్నార‌ని చెప్పారు. దీంతో (Bhanumathi) ఆమెతో ఇక చేయ‌డం కుద‌ర‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు దాసరి చెప్పారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus