Bhanupriya, Chiranjeevi: భానుప్రియను చూసి జాగ్రత్తపడిన మెగాస్టార్

సితార సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భానుప్రియ ఒకానొక దశలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. అది కూడా విజయశాంతి రాధ వంటి వాళ్లు డామినేషన్ చేస్తూ అగ్రహీరోలతో సినిమాలు చేస్తున్న క్రమంలో వారికి దీటుగా భానుప్రియ నిలిచింది. అయితే అందం విషయంలో ఆమె పై కొన్ని నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఆమె ఏమాత్రం లెక్క చేయలేదు. ఒక విధంగా భానుప్రియ కూడా ప్రధాన ఆయుధం ఆమెకి క్లాసికల్ డాన్స్ ఎక్కువగా రావడమే.

ఆమెను అందరూ నాట్యమయూరి అని పిలుస్తూ ఉంటారు. కేవలం నాట్యం చేయడమే కాకుండా సినిమాలో ప్రతి పాటకు కూడా ఆమె ఇచ్చే హావ భావాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఆమె కదలికలతో అర్థమయ్యేలా చెప్పడంలో ప్రత్యేక స్టెప్పులు కలిగి ఉంటుంది. ఈ విషయం అప్పట్లో బాగా అర్థం అయ్యేది. ఇక రీసెంట్ గా పరుచూరి గోపాలకృష్ణ ఆమె గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. శ్రీదేవి జయసుధ జయప్రద జనరేషన్ తరువాత విజయశాంతి రాధ భానుప్రియ వంటివారు అగ్రహీరోయిన్స్ గా మంచి గుర్తింపు పొందారు.

అయితే చిరంజీవి గారితో అప్పట్లో రాధా తప్పితే మరెవరూ డాన్స్ చేయలేరు అని ఎవరో అన్నట్లు గుర్తుంది. అయితే చిరంజీవి గారు మాత్రం భానుప్రియ తో డాన్స్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అంటూ ఉండేవారు. ఎందుకంటే ఆమె మంచి డాన్సర్ అని అందరికి తెలుసు. ఆ మాట ఎందుకు అన్నారో తెలియాలి అంటే స్టేట్ రౌడీ సినిమా చూస్తే ఆ విషయం మీకు బాగా అర్థం అయిపోతుంది అని ఆయన తెలియజేశారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus