Actress Bhanupriya: ఒకప్పటి స్టార్ హీరోయిన్ భానుప్రియ పెళ్లి, విడాకుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

టాలీవుడ్ సెకండ్ జనరేషన్ స్టార్ హీరోయిన్లలో భానుప్రియ కూడా ఒకరు. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సితార చిత్రంతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడం.. అటు తర్వాత వచ్చిన ‘స్వర్ణకమలం’ కూడా ప్రేక్షకులను అలరించడంతో ఆమెకు వరుస అవకాశాలు దక్కాయి. భానుప్రియ క్లాసికల్ డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. అప్పటి స్టార్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు నటించిన ఎన్నో హిట్ చిత్రాల్లో ఆమె నటించింది.

తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అన్ని భాషల్లోనూ కలుపుకుని ఆమె 110 కి పైగా సినిమాల్లో నటించిన భానుప్రియ ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే భానుప్రియ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి ఎక్కువగా తెలిసి ఉండకపోవచ్చు. ఆమె పుట్టి పెరిగింది ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి జిల్లాకు చెందిన రంగంపేట అనే ఊరిలో కావడం విశేషం.

భానుప్రియ ఓ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. సినిమాల్లో కొనసాగినప్పుడు ఆమె కాల్షీట్లు అన్నీ ఆమె తల్లి చూసుకునేది. భానుప్రియ అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లికి భానుప్రియ తల్లి అంగీకరించలేదట.’అతను నీకు తగిన వ్యక్తి కాదు.. దయచేసి అతన్ని మర్చిపోమని’ ఆమె హెచ్చరించిందట.

అయినా సరే తల్లి మాటని కాదని అమెరికా వెళ్లి మరీ ఆదర్శ్ ను పెళ్లి చేసుకుంది భానుప్రియ. ఈ దంపతులకు అభినయ అనే కుమార్తె కూడా ఉంది. అయితే భానుప్రియ ఆదర్శ ల మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడిపోయారు. కొన్నాళ్ళకు ఆదర్శ్ కూడా మరణించిన సంగతి తెలిసిందే. తల్లి మాట కాదని పెళ్లి చేసుకున్న భానుప్రియ.. వైవాహిక జీవితం చివరికి ఇలా అయిపోయింది అని స్పష్టమవుతుంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video
v
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus