Bhumika: ఆ సినిమా కోసం చాలా సినిమాలను వదులుకున్నాను: భూమిక

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న భూమిక ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఎంతో బిజీగా ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆగ్రహ హీరోలు అందరి సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన భూమిక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన కిసీ కా బాయ్..కిసీ కీ జాన్ సినిమాలో నటించారు.

ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి భూమిక తన బాలీవుడ్ సినిమాల గురించి అలాగే అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలియజేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో భూమిక నటించిన మొదటి చిత్రం తేరే నామ్. ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా.. దివంగత దర్శకుడు సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించారు.

ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన మొదటి సినిమా సూపర్ హిట్ అవడంతో (Bhumika) ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయట. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె ఓ పెద్ద ప్రాజెక్టులో అవకాశాన్ని అందుకున్నారని తెలియజేశారు. దురదృష్టవశాత్తు ఈమె ఆ సినిమాకు కమిట్ అయిన తర్వాత సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ మారిపోయారని దాంతో ఆ సినిమా నుంచి తనని తప్పించారని తెలిపారు.

ఇక ఈ సినిమా కోసం దాదాపు తాను ఏడాది పాటు ఎదురు చూసానని ఈ సినిమాలో నటించాలన్న ఉద్దేశంతో ఇతర సినిమా అవకాశాలను కూడా కోల్పోయానని భూమిక వెల్లడించారు.ఇలా ఈ సినిమాతో పాటు మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టుల నుంచి తనని తప్పించారని అప్పట్లో తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదురైనటువంటి చేదు అనుభవాలను ఈ సందర్భంగా బయటపెట్టారు. ఇలా బాలీవుడ్ సినిమాల గురించి భూమిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus