Dia Mirza: మతిపోగొట్టే కామెంట్లు చేసిన ‘వైల్డ్ డాగ్’ హీరోయిన్ దియా మీర్జా..!

ఇటీవల నాగార్జున హీరోగా వచ్చిన ‘వైల్డ్ డాగ్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా. ఆ చిత్రంలో ఈమె పాత్ర చాలా అంటే చాలా చిన్నది. తిప్పి కొడితే 5 నిమిషాలకు మించదు ఈమె పాత్ర. అయినప్పటికీ ‘వైల్డ్ డాగ్’ సినిమా కోసం ఈమె ప్రమోషన్లు గట్టిగానే చేసింది. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరిలో ఈమె రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.కానీ 40 రోజులకే ఈమె బేబీ బంప్ ని చూపిస్తూ ఫోటో షేర్ చెయ్యడంతో..

‘పెళ్ళికి ముందే ఈమె గర్భవతి అయ్యిందని.. అందుకే వెంటనే పెళ్లి చేసుకుందని’ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఇటీవల ఈ కామెంట్స్ పై దియా స్పందించి దిమ్మతిరిగే కామెంట్లు చేసింది. ఆమె ఏమాట్లాడుతూ..”నేను ప్రెగ్నెంట్ కావడం వల్లనే హడావిడిగా పెళ్లి చేసుకున్నాను’ అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కానీ వాటిలో ఎంత మాత్రం నిజం లేదు.వైభవ్ నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాం. కొన్నాళ్ల నుండీ మేము కలిసే ఉంటున్నాం.

ముహూర్తం ఫిక్స్ చేసుకొనే టైంకి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ ఆ విషయం మాకు పెళ్లి ఫిక్సయ్యాక తెలిసింది. ప్రెగ్నెన్సీ కి పెళ్లికి సంబంధం లేదు. పెళ్లి అయ్యాకే ప్రెగ్నెంట్ అవ్వాలి అని అందరూ రూల్స్ కూడా పెట్టలేదు. సో ప్రెగ్నెంట్ అవ్వడం వల్లనే పెళ్లి చేసుకున్నాను అనే కామెంట్లు ఇక ఆపెయ్యండి” అంటూ చెప్పుకొచ్చింది దియా మీర్జా.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus