Bigg Boss: పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన బిగ్ బాస్!

బిగ్ బాస్ రియాలిటీ షో కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ కన్నడ భాషలలో కూడా ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం హిందీలో 17వ సీజన్ ప్రసారమవుతుంది ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకోగా మరి కొందరు భారీ స్థాయిలో నెగిటివిటీ మూటకట్టుకుని బయటకు వస్తున్నారు. ఇకపోతే కొంతమంది సెలబ్రిటీ కపుల్స్ ని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా పంపిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా హిందీ బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లినటువంటి ఓ జంట ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా విడాకులు తీసుకునే పరిస్థితికి వెళ్లారని తెలుస్తోంది. బాలీవుడ్ బుల్లితెర ఫేమస్ నటి అంకితా లోఖండే.. విక్కీ జైన్.. ఈ ఇద్దరు హిందీలో బిగ్ బాస్ 17 సీజన్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. అంకితా లోఖండే.. పవిత్ర రిష్తా సీరియల్ ద్వారా పాపులర్ అయింది. ఇక వీరిద్దరూ గత రెండు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.

ఇలా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంటకు (Bigg Boss)  బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా విక్కి అంకితపట్ల చులకన భావంతో ప్రదర్శిస్తూ ఇతర కంటెస్టెంట్ల ముందు తనని అవమాన పరుస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు రావడం మొదలయ్యాయి. ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగిన తరుణంలోని ఇద్దరు మధ్య గొడవలు పెద్దవి కావడంతో చివరికి అంకిత తన భర్త విక్కీ నుంచి విడిపోవడానికి కూడా సిద్ధమైనదని తెలుస్తుంది.

ఈ క్రమంలో తనకు విడాకులు ఇవ్వబోతున్నాను అంటూ ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో ఎంతోమంది బిగ్ బాస్ కార్యక్రమం పట్ల విమర్శలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల సంతోషంగా ఉన్నటువంటి వారి జీవితాలలో కూడా చిచ్చు పెడుతున్నారని అందుకే ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలి అంటూ కొందరు డిమాండ్స్ చేస్తున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus