కొన్నాళ్లుగా బ్రతికున్న సెలబ్రిటీలు చనిపోయారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ హీరో శ్రీకాంత్, చంద్రమోహన్, కోటా శ్రీనివాసరావు, ‘రంగస్థలం’ మహేష్ వంటి వారు చనిపోయారు అంటూ ప్రచారం జరిగింది. ఆ వార్తలు ఎక్కువవడంతో వారు సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఓ హీరోయిన్ చనిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆమె మరెవరో కాదు దివ్య స్పందన.
గత నెలలో కన్నడ నటుడు విజయ్ భార్య స్పందన హార్ట్ ఎటాక్ తో చనిపోతే.. ఆమె పెద్ద కర్మ రోజు కొందరు ఆమెకు నివాళులు అర్పిస్తూ చేసిన ట్వీట్ల వల్ల.. కొందరు కన్ఫ్యూజ్ అయ్యి దివ్య స్పందన ఫోటోలు పెట్టి.. ఆమె చనిపోయినట్టు ప్రచారం చేశారు. దీంతో దివ్య స్పందన సన్నిహితులు ఆమెకు కాల్స్ చేసి అడగడం మొదలుపెట్టారట. ప్రస్తుతం ఆమె స్విట్జర్ లాండ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక దివ్య స్పందన… కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ‘అభిమన్యు’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. మొదట రమ్యగా ఉన్న ఆమె పేరును తర్వాత దివ్య స్పందనగా మార్చుకుంది. అటు తర్వాత ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ వంటి హిట్ సినిమాల్లో నటించింది .అయితే అటు తర్వాత ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా చేసిన ఈమె..తర్వాత బీజేపీ అధికారంలోకి రావడంతో రాజీనామా చేసింది. అయితే పొలిటికల్ గా కూడా ఏదో ఒక సెటైర్ వేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.
I just spoke to @divyaspandana She’s well. En route to Prague tomorrow and the to Bangalore.
— Chitra Subramaniam (@chitraSD) September 6, 2023