ఛాన్స్ వస్తే విజయ్ దేవరకొండతో నటిస్తా : ఫరియా

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న జాతిరత్నాలు సినిమా ఈ నెల 11వ తేదీన మహాశివరాత్రి పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమాలో తెలుగమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. జాతిరత్నాలు మూవీ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఫరియా అబ్దుల్లా ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను తెలుగమ్మాయినే కానీ తనకు తెలుగు బాగా మాట్లాడటం రాదని ఫరియా చెప్పారు.

హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ తన స్వస్థలం అని సినిమాల కోసం తెలుగు నేర్చుకుంటున్నానని ఆమె అన్నారు. తాను డ్యాన్సర్ కావాలని అనుకున్నానని కానీ హీరోయిన్ గా ఆఫర్ రావడంతో ఆ కల నెరవేరకుండా అలానే ఉండిపోయిందని ఫరియా తెలిపారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు థియేటర్ ఆర్టిస్ట్ గా పని చేశానని.. నక్షత్ర అనే వెబ్ సిరీస్ లో కూడా నటించానని ఫరియా చెప్పారు. హైదరాబాద్ లోని లయోలా కాలేజీలో తాను స్పీచ్ ఇచ్చానని..

ఆ స్పీచ్ చూసిన దర్శకుడు నాగ్ అశ్విన్ అడిషన్ కు పిలవడంతో జాతిరత్నాలు సినిమాలో ఆఫర్ దక్కిందని ఆమె అన్నారు. విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని అనుకుంటున్నానని.. సైకో పాత్రలో నటించడం తన డ్రీమ్ రోల్ అని ఆమె అన్నారు. తన్ ఫేవరెట్ హీరో ఫహద్ ఫాజిల్ అని ఫరియా వెల్లడించారు. స్టేజ్ షోలకు రిహార్సల్స్ చేస్తాం కాబట్టి ప్రదర్శించే సమయంలో స్టేజ్ షోలు బాగుంటాయని.. సినిమాలకు కూడా రిహార్సల్స్ చేస్తే బాగుంటుందని ఫరియా తెలిపారు.

జాతిరత్నాలు మూవీలో హీరోగా నటించిన నవీన్ మంచి సహనటుడు అని ఫరియా కితాబిచ్చారు. షూటింగ్ సమయంలో తెలుగు రాక తాను ఇబ్బంది పడుతుంటే నవీన్ ఇలా చేయ్.. అలా చేయ్ అంటూ బాగా సపోర్ట్ చేశాడని ఫరియా చెప్పారు. ప్రస్తుత సమాజ ధోరణిని ప్రతిబింబించే విధంగా ఈ సినిమా ఉంటుందని ఆమె అన్నారు.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus