Ram Charan: చరణ్‌ – బుచ్చిబాబు సినిమాలో ఆ హీరోయిన్‌… మొత్తంగా మూడోసారి!

రామ్‌ చరణ్‌ – బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఓ సినిమా అనౌన్స్‌ అయిన విషయం తెలిసిందే. చాలా నెలల క్రితమే అనౌన్స్‌ అయిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ క్రమంలో సినిమా గురించి చాలా ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అనే విషయం బయటికొచ్చింది. అందులో ఓ హీరోయిన్‌ పేరును దాదాపు ఖరారు చేసేశారు అని కూడా అంటున్నారు.

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్‌ చేయబోయే సినిమా ఉత్తరాంధ్రలోని గ్రామీణ నేపథ్యంలో సాగుతుందట. కబడ్డీ ఆట ప్రధానంగా సాగే ఈ సినిమాను త్వరలో ప్రారంభిస్తారట. ప్రస్తుతం కాస్టింగ్‌ పనులు తుది దశకు చేరుకున్నాయట. అలా ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు చోటు కల్పించారట. తొలుత ఒక నాయిక ఉన్నప్పుడు ఆ పాత్ర జాన్వీ కపూర్‌ చేస్తుందని చెప్పారు. ఆ తర్వాత వేరే బాలీవుడ్‌ హీరోయిన్‌ తనయను అనుకుంటున్నారు అని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఇద్దరట.

అందులో ఓ నాయికగా కియారా అడ్వాణీని ఎంచుకున్నారు అని సమాచారం. ఇప్పటికే ‘వినయ విధేయ రామా’ సినిమాలో ఇద్దరూ కలసి నటించారు. ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’లో నటిస్తోందీ జంట. ఇప్పుడు బుచ్చిబాబు సానా సినిమా ఓకే అయితే హ్యాట్రిక్‌ అవుతుంది. చరణ్‌ సినిమాల్లో హీరోయిన్ల రిపీట్‌ అంటే కాజల్‌ మాత్రమే గుర్తొస్తుంది. ఇప్పుడు కియారా కూడా గుర్తొస్తుంది అన్నమాట. ఎందుకంటే మూడో సినిమా కదా.

కియారా పాత్ర సగటు హీరోయిన్‌ పాత్రలా ఉండదని, సినిమాలో కీలక సమయంలో మలుపు తిప్పేలా ఉంటుంది అని చెబుతున్నారు. సినిమా ప్రారంభమయ్యాక ఈ విషయంలో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో ఓ బాలీవుడ్‌ స్టార్‌ ముఖ్య పాత్రలో కనిపిస్తాడట. అలాగే విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో విలన్‌గా నటిస్తాడు. ఏఆర్‌ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలసి వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus