పెళ్లి మాత్రం మా అమ్మకు నచ్చినట్లుగానే చేసుకుంటాను : హన్సిక

“దేశముదురు” చిత్రంతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన హన్సికకు ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఈమధ్యకాలంలో అమ్మడు కాస్త సినిమాలు తగ్గించింది కానీ.. ఒక అయిదారేళ్ళ క్రితం వరకు హన్సిక స్పీడ్ చూసి తోటి హీరోయిన్స్ అందరూ కంగారుపడ్డారు. అలాంటి హన్సిక ప్రస్తుతం తమిళ చిత్రసీమకు మాత్రమే పరిమితం అయిపోయింది. దాంతో అమ్మడు ఇంక పెళ్లి చేసుకొంటుందేమో అందుకే సినిమాలకి దూరంగా ఉంటుందేమోననుకోన్నారందరూ. కట్ చేస్తే.. తీసుకొన్న గ్యాప్ సన్నబడడానికి కానీ పెళ్లి కోసం కాదని కొత్త ఫోటోషూట్స్ తో చెప్పకనే చెప్పింది.

అయితే.. ఇటీవల మళ్ళీ ఆమెను పెళ్లి విషయంలో మీడియా ఇబ్బందిపెట్టడంతో, “నాకు ప్రేమ పెళ్లి అంటే ఇష్టమే కానీ.. మా అమ్మకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇంకా ఇష్టం. అందుకే.. మా అమ్మ ఎవర్ని చూపించి పెళ్లి చేసుకోమంటే ఆ కుర్రాడినే పెళ్లి చేసుకొంటాను అని చెప్పుకొచ్చింది హన్సిక. సో, డియర్ హన్సిక లవర్స్.. ఆమెను మనసు పడిన వాళ్ళందరూ ఇంకో హీరోయిన్ని వెతుక్కోవడం మంచిది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus