బాలనటిగా ఎన్నో బాలీవుడ్ సినిమాలలో నటించి అనంతరం హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు నటి హన్సిక. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ విధంగా హన్సిక మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమెకు తెలుగు తమిళ భాషలలో పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయి. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడిపినటువంటి హన్సిక ప్రస్తుతం పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
అయితే పెళ్లి తర్వాత కూడా ఈమె సినిమాలు అలాగే వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు.తాజాగా ఈమె నటించిన మైత్రి అనే సిరీస్ విడుదలకు సిద్ధమవుతుంది ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హన్సిక తన అలవాట్ల గురించి తెలిపారు. ఈ సందర్భంగా హన్సిక (Hansika) మాట్లాడుతూ తనకు రొమాంటిక్ సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం అని తెలిపారు.
ఇప్పటికే తాను చాలా రొమాంటిక్ సినిమాలను చూసానని ఈమె తెలియజేశారు. అయితే ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత ఎన్నో వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ప్రసారమయ్యే రొమాంటిక్ వెబ్ సిరీస్ ను పూర్తిగా చూడనిదే తాను నిద్రపోనని ఈమె తెలియజేశారు.
ఇలా తాను రొమాంటిక్ సినిమాలు లేదా వెబ్ సిరీస్ లో చూడటం మొదలుపెట్టాను అంటే పూర్తి అయ్యే వరకు పక్కన కు కూడా కదలననీ అది పూర్తి చేసిన తర్వాతనే తాను నిద్రపోతాను అంటూ ఈ సందర్భంగా హన్సిక చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా మధ్యలో వీటిని చూడటం ఆపి ఏదైనా పని చేయాలన్నా కూడా తనకు ఏ మాత్రం దిక్కుతోచదని హన్సిక తన అలవాట్ల గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?
మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!