Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్ మృతి
- August 18, 2026 / 06:07 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ హాలీవుడ్ కథానాయిక, ‘హీరోస్’ వెబ్ సిరీస్‌తో మంచి పేరు తెచ్చుకున్న హేడెన్ పానెటెర్ (36) మృతి చెందింది. ఆమె పుట్టిన రోజు (ఆగస్టు 21)కు ఇంకా నాలుగు రోజులు ఉండగానే ఆమెకు చనిపోవడం కుటుంబంలో, సన్నిహితుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం హేడెన్ కన్నుమూసినట్లు ఆమె ప్రతినిధి మీడియాకు తెలిపారు. అయితే హేడెన్ ఎలా చనిపోయింది అనే విషయం మాత్రం టీమ్ చెప్పలేదు.
Hayden Panettiere
అయితే, హేడెన్ మృతిని పోలీసులు అనుమానాస్పద మృతిగా పరిగణించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హేడెన్ ఆగస్టు 21, 1989న న్యూయార్క్‌లో జన్మించింది. 11 నెలల వయసులోనే ఓ ప్రకటనలో నటించింది. 1994లో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె వరుస సినిమాలు, షోలు చేసింది. ‘హీరోస్’ సిరీస్‌లో క్లేర్ బెన్నెట్ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ‘నాష్‌విల్లె’, ‘రిమెంబర్ ది టైటాన్స్’, ‘స్క్రీమ్ 4’ వంటి సినిమాలు చేసింది. ‘ఎ బగ్స్ లైఫ్’ అనే సినిమాలో ప్రిన్సెస్ డాట్ పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చి గ్రామీ అవార్డు నామినేషన్ పొందింది హేడెన్.
‘దిస్ ఈజ్ మీ: ఎ రెకనింగ్’ పేరుతో ఇటీవల ఆమె తన ఆత్మకథను విడుదల చేయడం గమనార్హం. చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి రావడం వల్ల తాను ఎదుర్కొన్న సవాళ్లు, మానసిక ఒత్తిడి, అడిక్షన్ సమస్యల గురించి ఆ పుక్తంలో హేడెన్ రాసుకొచ్చింది. అయితే గత కొన్ని రోజుల హేడెన్ కాస్త ఇబ్బందులు ఎదుర్కొంది అని సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.













