Sridevi, Hema: ఆ సూపర్ హిట్ సినిమాలో కాసేపు శ్రీదేవి కనిపించారు హేమ..!

హేమ ఏంటి? ఏకంగా శ్రీదేవికి డూప్ గా నటించడం ఏంటి? ఇది నమ్మడానికి కొంత అనుమానంగా ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజం. శ్రీదేవికి ఓ సినిమాలో హీరోయిన్ గా హేమ నటించారు. సినిమాల్లో స్టార్లకు డూప్ ల అవసరం చాలా ఉంటుంది. ఉదాహరణకి ‘హలో బ్రదర్’ సినిమాలో నాగార్జునకి డూప్ గా శ్రీకాంత్ నటించారు. ఇక ‘తొలి ముద్దు’ సినిమాలో దివ్యభారతికి డూప్ గా రంభ నటించారు.ఇక ‘ముగ్గురు మొనగాళ్లు’ చిరంజీవికి డూప్ గా చిరంజీవి గారి పర్సనల్ అసిస్టెంట్ ..

సుబ్బారావు గారు కాగా, మరొకరు ప్రముఖ నటుడు హరిబాబు వంటి వారు నటించారు.డబుల్ రోల్ చేయాల్సి వచ్చినప్పుడు రిస్కీ షాట్లలో, ఫైటింగ్ సీన్స్‌‌‌లలో డూప్‌‌ ల అవసరం ఉంటుంది. ఇదే కోవలో శ్రీదేవి గారికి కూడా డూప్ అవసరం పడింది. అందుకోసం హేమగారిని శ్రీదేవిగా చూపించారు. ఆ మూవీ మరేదో కాదు ‘జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి’.ఈ సినిమాలో ఓ సన్నివేశంలో భాగంగా శ్రీ‌దేవి ఈత కొల‌నులో ఈత కొట్టాల్సి ఉంది. ఆ తరుణంలో విలన్ అమ్రిష్ పురి ఎంట్రీ ఇస్తాడు.

అయితే శ్రీదేవికి ఈత రాదు. అందుకోసం ఈత వ‌చ్చిన అమ్మాయని కొందరు హేమ పేరుని సిఫార్సు చేసారు. దాంతో హేమ ఊటీలో మరో సినిమా షూటింగ్‌‌‌‌లో ఉన్నప్పటికీ ఈమెని ఏరి కోరి శ్రీదేవి డూప్‌‌‌గా చేయడానికి తీసుకెళ్లారట. లాంగ్ షాట్‌‌‌లలో కనుక గమనిస్తే హేమ గారిని మనం గమనించవచ్చు. అటు తర్వాత వెంకటేష్- రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘క్షణం క్షణం’ మూవీలో శ్రీదేవితో కలిసి నటించారు హేమ.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus