మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల నేపథ్యంలో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ఓపక్క ప్రకాష్ రాజ్ ప్యానెల్, మరోపక్క మంచు విష్ణు ప్యానెల్ ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి దిగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం నాడు నటి హేమ ‘మా’ మాజీ అధ్యక్షుడు నరేష్, నటి కరాటే కళ్యాణిలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు లేఖ రాశారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 10న జరగనున్న ఎన్నికల్లో హేమ పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే.
నిన్న తనపై కరాటే కళ్యాణి, వి.నరేష్ కు కొన్ని అవాంఛితమైన, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలతో ఒక వీడియోను విడుదల చేసిన విషయాన్ని హేమ ఈసీకు తెలిపింది. సినీ రంగానికి చెందిన నటీమణుల ఫొటోలను మార్ఫింగ్ చేసి, వాటికి అసభ్యకరమైన వ్యాఖ్యలను జోడించి, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో పోస్ట్ చేస్తున్నారని.. ఈ విషయంలో తను పోలీసులకు ఫిర్యాదు చేశానని… ఆ తరువాత ఇలాంటి ఘటనలు తగ్గాయని చెప్పింది. అయితే ఈ విషయంలో పోలీస్ కంప్లైంట్ చేసే సమయంలో వారు నాకే రివర్స్ లో క్లాస్ పీకారని..
ముందు మీకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలను సోషల్ మీడియాలో నుంచి తీయమని పోలీసులు సలహా ఇచ్చినట్లు కళ్యాణి వ్యాఖ్యలు చేసిందని హేమ అన్నారు. కళ్యాణి చేసిన ఆ వ్యాఖ్యలను నరేష్ సమర్ధించారని.. తను అమర్యాదకరమైన ఫొటోలను గ్రూపుల్లో పెట్టి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లు కూడా నరేష్, కళ్యాణి అంటున్నారని.. వారి వైఖరి తనను అగౌరవపరిచేలా ఉందని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. తనపై సభ్యకరమైన ప్రచారాలు చేయకుండా కట్టడి చేయాలని ఈసీని కోరింది. తనపై నరేష్, కళ్యాణిలు చేసిన వ్యాఖ్యల వీడియోలను తొలగించమని యూట్యూబ్ యాజమాన్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు హేమ తెలిపింది.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!