మహేష్,పవన్ ల పై సంచలన కామెంట్లు చేసిన నటి హేమ..!

టాలీవుడ్ నటీనటుల్లో హేమకు ఓ ప్రత్యేక స్థానం ఉందనడంలో సందేహం లేదు. అమ్మ,పిన్ని, గయ్యాళి పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించింది నటి హేమ. దాదాపు స్టార్ హీరోలందరి చిత్రాల్లోని నటించింది హేమ. ఇటీవల జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)’ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు వైసీపీ పార్టీ తరుపున ప్రచారానికి దిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ… టాప్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

ఈ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ.. “మహేష్ బాబు.. నన్ను చాలా ఏడిపిస్తాడు. నేనొక వేళ అద్దం చూసుకుంటే.. ‘అసలు మీ ఫేసే లేదు.. మీరెందుకు అద్దం చుస్తున్నారు.. ముందక్కడ పెట్టండి ఆ అద్దం..’ అని అంటాడు మహేష్. అలాగే నేను కూడా.. ఏంటి బాబు లావైపోతున్నారు అంటే.. ‘కళ్ళు దొబ్బయా,’అతడు’ సినిమాలో ఇంకా లావుగా ఉంటాను’ అని అన్నాడు మహేష్. దానికి నేను ‘అతడు’ సినిమాలో మిమ్మల్నెవడు చూసాడు అని అన్నాను. దానికి మహేష్ ‘అదేంటి అంతమాటనేసారు’ అని అన్నాడు. దీనికి నేను…. అవును మీరు ‘అతడు’ సినిమాలో చాక్లెట్ బాయ్ లా, అమూల్ బేబీ లా ఉంటారు. సో మీరు పెద్ద మ్యాన్లీగా అనిపించలేదు.. కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. ‘పోకిరి’ తరువాత మీరు మగాడిలా అనిపించారు. అప్పటి నుండే మిమ్మల్ని ఫాలో అవ్వడం మొదలు పెట్టాను అన్నాను. ఇక ‘అన్నవరం’ సినిమా టైములో పవన్ కళ్యాణ్ గారు నా దగ్గరికి వచ్చి, హేమగారూ… మీరు చాలా బాగా యాక్ట్ చేస్తారండీ .. చాలా నేచురల్ గా ఉంటుంది అన్నారు. అప్పుడు నేను థ్యాంక్స్ అంటే బాగుండేది .. కానీ ‘నాలాగే మీరు కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారండీ’ అన్నాను. అక్కడ నా ఉద్దేశం ఏమిటంటే పవన్ కల్యాణ్ గారు కూడా చాలా నేచురల్ గా చేస్తారు అని .. కానీ నా నోటి నుండీ అలా వచ్చేసింది. అయినా ఆయన పెద్దగా పట్టించుకోకుండా నవ్వుతూ అక్కడి నుండీ వెళ్ళిపోయారు. ఆ తరువాత కూడా ఆయనతో కలిసి చాలా సినిమాల్లో నటించాను” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus