సావిత్రి విషయంలో తుది నిర్ణయం ప్రేక్షకులదే!
- July 12, 2016 / 12:49 PM ISTByFilmy Focus
మహానటి సావిత్రి జీవిత కథను సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు నాగఅశ్విన్. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయిన ఈ దర్శకుడు మొదటి చిత్రంతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఈ నేపధ్యంలో తన రెండో సినిమా కూడా వైవిధ్యంగా ఉండాలని సావిత్రి కథను ఎన్నుకున్నాడు. అయితే నాగఅశ్విన్ ఈ సినిమా చేస్తున్నాడని తెలియగానే అనుష్క అయితే సావిత్రి పాత్రకు పెర్ఫెక్ట్ అని అందరూ భావించారు. కానీ డైరెక్టర్ మాత్రం ఏ సినిమా కోసం ఎవరిని ఫైనల్ చేయకుండా.. ప్రేక్షకుల అభిప్రాయాన్ని తీసుకోవాలని భావిస్తున్నాడు. దీనికోసం నెట్ లో కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు.
నెటిజన్స్ ఇచ్చిన వోటింగ్ ప్రకారం హీరోయిన్ ను ఎంపిక చేయనున్నారు. అంటే సావిత్రి విషయంలో ప్రేక్షకులదే పైచేయి అన్నమాట.
Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












