Indraja: జబర్దస్త్‌కు గ్యాప్‌ ఇస్తున్న ఇంద్రజ.. ఆమె కోసమే అంటూ కామెంట్లు..

‘జబర్దస్త్‌’ అంటే కమెడియన్లే కాదు.. వాళ్లను జడ్జ్‌ చేసే జడ్జీలు కూడా. వాళ్లు ఎంత కామెడీ చేసినా.. వాళ్లను ఓ లెవల్‌లోకి తీసుకెళ్లడం జడ్జిల పని అంటుంటారు. కామెడీ తగ్గినా, శ్రుతి మించుతున్నా సుతిమెత్తగా, ఒక్కోసారిగా కాస్త కటువుగా క్లాస్‌ పీకుతుంటారు కూడా. అయితే ఈ క్రమంలో వాళ్లతో కమెడియన్లకు మంచి అనుబంధం ఏర్పడుతుంది. అలా ఇప్పుడు కొత్త తరం జబర్దస్త్‌ కమెడియన్లకు ఎంతగానో దగ్గరైన నటి, జడ్జి ఇంద్రజ (Indraja) గ్యాప్‌ ఇస్తున్నారు.

అవును, గత కొన్నేళ్లుగా జబర్దస్త్‌, శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు జడ్జిగా చేస్తూ వస్తున్న ఇంద్రజ గ్యాప్‌ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమెనే ప్రకటించారు. వచ్చే వారం జబర్దస్త్‌ ప్రోమోను టీమ్ విడుదల చేసింది. అందులోనే ఆమె ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. కార్యక్రమానికి గ్యాప్‌ తీసుకుంటున్నాను అంటూ ఆమె భావోద్వేగానికి గురవ్వడం ప్రోమోలో చూడొచ్చు. అయితే ఎందుకు గ్యాప్‌ అనేది చెప్పలేదు.

చాలా ఏళ్లపాటు జబర్తస్త్‌ రెండు వెర్షన్లకు రోజా ఓ జడ్జిగా ఉంటూ వచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ఆమె మంత్రి అవ్వడంతో గ్యాప్‌ ఇచ్చారు. దీంతో ఆ స్థానంలోకి కొంతమంది నటీమణులు వచ్చినా.. ఫైనల్‌ ఇంద్రజ ఆ ప్లేస్‌లో ఫిక్స్‌ అయ్యారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఆమె గ్యాప్‌ తీసుకుంటున్నాను అని అనౌన్స్‌ చేశారు. దీంతో ఏమైంది అనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఆ షోను ఆమె మొత్తంగా హ్యాండిల్‌ చేస్తున్నారు అంటుంటారు.

అయితే, ఇప్పుడు ఇంద్రజ గ్యాప్‌ ఇవ్వడానికి, గతంలో ఆమె ఓ సందర్భంలో చెప్పిన మాటను పోల్చి చూస్తున్నారు. ‘రోజా (Roja) ఎప్పుడైనా తిరిగి వస్తాను అంటే.. వెంటనే సీటు ఖాళీ చేస్తా’ అని ఇంద్రజ గతంలో అన్నారు. ఇప్పుడు రోజా కోసమే ఈ గ్యాప్‌ ఏమో అంటున్నారు. ఎన్నికలు అయిపోవడంతో రోజా తిరిగి ‘జబర్దస్త్‌’ సెట్స్‌కి వస్తారు అని టాక్‌. మళ్లీ ప్రభుత్వంలో పార్టీ వస్తే.. తిరిగి కార్యక్రమానికి ఆమె గ్యాప్‌ ఇస్తారు అని టాక్‌. వచ్చే వారం ప్రోమో వస్తే కానీ అసలు విషయం తెలియదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus