Ivana :విజయ్‌ కొత్త సినిమాలో ఇద్దరు నాయికలు… కానీ ఒక్కరే!

విజయ్‌ – వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. విజయ్‌ 68వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పటికే తెలిశాయి. తాజాగా మరో విషయం ఆసక్తిరేపుతోంది. అదే ఈ సినిమాలో మరో నాయిక కూడా ఉంది అని. మీనాక్షి చౌదరిని ఈ సినిమా కోసం టీమ్‌ ఓకే చేసింది. అయితే ఆమెతోపాటు మరో నాయిక కూడా ఈ సినిమాలో ఉంటుందట. ఆమెనే కుర్ర నాయిక ఇవానా.

‘లవ్‌ టుడే’ సినిమాతో హీరోయిన్‌గా అదిరిపోయే ఇంట్రడక్షన్‌ అందుకున్న ఇవానాకు విజయ్‌ సినిమాలో ఛాన్స్‌ ఇచ్చారట. అయితే అది హీరోయిన్‌ పాత్ర కాదట. సినిమాలో ఎంతో కీలకమైన చెల్లెలి పాత్ర అట. ఈ మేరకు కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే దీనికి సంబంధించి అనౌన్స్‌మెంట్‌ త్వరలో వస్తుంది అని అంటున్నారు. ‘లియో’ సినిమా తర్వాత గ్యాప్‌ తీసుకున్న విజయ్‌… ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్‌కి రెడీ అవుతున్నాడట.

ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య రెండు వార్తలు వైరల్‌ అయ్యాయి. అందులో ఒకటి సినిమాకు పాలిటిక్స్‌కు లింక్‌ ఉంటుందని, రెండోది ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ నటిస్తున్నాడని. ఈ రెండు విషయాల్లో క్లారిటీ రాలేదు కానీ… కొత్త పుకార్లు మొదలయ్యాయి. అయితే ఆమిర్‌ ఖాన్‌ ఈ సినిమాలో నటిస్తే వావ్‌ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఓకే చేశాడంటే ఆ పాత్ర చాలా బలంగా ఉంటుంది అని చెప్పొచ్చు.

అన్నట్లు బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌లు ఇప్పుడు దక్షిణాది సినిమాల్లో మెరవడం ఎక్కువ అవుతోంది. రజనీకాంత్‌ ‘జైలర్‌’ సినిమాలో జాకీ ష్రాఫ్‌, విజయ్‌ ‘లియో’ సినిమాలో సంజయ్‌ దత్‌, పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ సినిమాలో ఇమ్రాన్‌ హష్మీ, ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమాలో సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు / నటిస్తున్నారు. ఇప్పుడు ఆమిర్‌ ఖాన్‌ కూడా తమిళ చిత్రసీమలో అడుగుపెడితే సరి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus