Janhvi Kapoor: అమ్మను పోగొట్టుకున్నా.. ఆ లోటును తీర్చలేరు.. జాన్వీ కపూర్ ఏమన్నారంటే?

భాషతో సంబంధం లేకుండా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశం ఉంది. జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. గతంలో కొరటాల శివ కియారాను టాలీవుడ్ కు పరిచయం చేయగా కియారా అద్వానీ స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తున్నారు.

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) విషయంలో సైతం అదే మ్యాజిక్ రిపీట్ అయ్యే అవకాశం ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జాన్వీ కపూర్ శ్రీదేవితో గడిపిన చివరి క్షణాలను తలచుకుంటూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా జాన్వీ కపూర్ కు ఆఫర్లు వస్తున్నాయి. జాన్వీ కపూర్ మాట్లాడుతూ ఆ సమయంలో అమ్మ దుబాయ్ కు వెళ్లడం విషయంలో బిజీగా ఉందని అన్నారు.

అమ్మ దుబాయ్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటుండగా నేను షూటింగ్ కు వెళ్లి వచ్చి అలసిపోయానని ఆమె చెప్పుకొచ్చారు. అమ్మతో మాట్లాడుతూ నాకు నిద్ర వస్తుందని చెప్పి పడుకున్నానని ఆమె పేర్కొన్నారు. అమ్మ నా రూమ్ కు వచ్చిన టైమ్ లో నేను నిద్రపోతున్నానని అయితే అమ్మ నా రూమ్ కు వచ్చిందనే విషయం మాత్రం నాకు తెలుసని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు.

అమ్మ పనులను ముగించుకుని నా దగ్గరకు వచ్చి నన్ను దగ్గరగా పట్టుకుని నా తలపై చేతులు వేసిందని అమ్మ నాతో గడిపిన చివరి క్షణాలు అవేనని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. అమ్మ లేని లోటును ఎవరూ తీర్చలేరని ఆమె కామెంట్లు చేశారు. జాన్వీ కపూర్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. జాన్వీ కపూర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. జాన్వీకి భాషతో సంబంధం లేకుండా క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus