Jayalalitha: కట్టుకున్నవాడే నాతో అలాంటి సీన్స్ చేయించాడు: నటి జయలలిత

మలయాళ సినిమాలతో పాటు తెలుగు మూవీస్‌లో వ్యాంప్ క్యారెక్టర్లు చేసి అప్పట్లో కుర్రకారును ఒక ఊపు ఊపేసిన నటి జయలలిత. హీరోయిన్ ఆఫర్‌తో అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఈ క్లాసికల్ డాన్సర్.. దురదృష్టవశాత్తు ఎన్నో మంచి అవకాశాలను చేజార్చుకున్నారు. చివరికి ఫ్యామిలీ కోసం మలయాళ సినిమాల్లో వ్యాంప్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చింది. అదే ఇమేజ్‌తో తెలుగులోనూ అలాంటి పాత్రలే ఎక్కువగా చేశారు. దీంతో ఆమెకు ‘బోరింగ్ పాప’ అనే బిరుదు కూడా ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న (Jayalalitha) ఆమె.. తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా పెళ్లి, తన భర్త వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నేనొక క్లాసికల్‌ డ్యాన్సర్‌. దేశవ్యాప్తంగా దాదాపు 1000కు పైగా ప్రదర్శనలు ఇచ్చా. అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టా. కుటుంబం మొత్తం నాపై ఆధారపడి ఉండటంతో అప్పట్లో ఎలాంటి అవకాశాలు వచ్చినా కాదనకుండా నటించా. వినోద్‌ అనే దర్శకుడిని ప్రేమించా. మేమిద్దరం దాదాపు ఏడేళ్లు ప్రేమించుకున్నాం.

అతడు తెరకెక్కించిన ఓ సినిమాలో నాతో అడల్ట్‌ సీన్స్‌ చేయించాడు. అతడికి దూరంగా ఉండాలనుకున్నా. పెళ్లికి అంగీకరించకపోతే చచ్చిపోతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. చేసేది లేక పెళ్లి చేసుకున్నా. పెళ్లైన తర్వాత రోజే అతడి నిజస్వరూపం తెలిసింది. ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని అర్థమైంది. చిత్ర హింసలు పెట్టాడు. యాసిడ్‌ పోస్తానన్నాడు. గదిలో బంధించాడు. సన్నిహితుల సాయంతో ఆ చెర నుంచి బయటపడ్డా’’ అని ఆమె చెప్పారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus