Jyothi: ‘బిగ్ బాస్’ బ్యూటీ జ్యోతి సంచలన కామెంట్లు వైరల్..!

‘పెళ్ళాం ఊరెళితే’ చిత్రంలో తిలోత్తమ గా పాపులర్ అయిన నటి జ్యోతి.. అటు తరువాత ‘అందరూ దొంగలే’ ‘గుడుంబా శంకర్’ ‘హంగామా’ ‘ఎవడి గోల వాడిదే’ వంటి చిత్రాల్లో నటించింది. ‘బిగ్ బాస్’ సీజన్ 1 లో కూడా ఈమె ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా వ్యాంప్ పాత్రలు చేస్తూ ఉండే ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు పలు సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ‘డేటింగ్ కు ఓ కుర్రాడు కావాలంటూ’ సంచలన కామెంట్లు చేసింది.

వివరాల్లోకి వెళితే.. ఇటీవల జ్యోతి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో యాంకర్.. ‘మీరు కొంతకాలంగా ఓ కుర్రాడితో డేటింగ్ లో ఉన్నారట కదా.. అతని పేరేంటి?’ అని ప్రశ్నించాడు. అందుకు జ్యోతి.. ‘మీరే చెప్పండి అతని పేరేంటో’? అని సమాధానం ఇచ్చింది. అంతేకాదు.. ‘నేను ఇప్పటివరకు డేటింగ్ కు వెళ్ళలేదు. కానీ మంచి కుర్రాడు ఉంటే చెప్పండి. డేటింగ్ చెయ్యడానికి నేను రెడీగా ఉన్నాను. అలా అని ఎవరితో పడితే వాళ్లతో కాదు.

లైఫ్లో సక్సెస్ అయ్యి,తెలివితేటలు కలిగి ఉండి, బాధ్యతలు తెలిసిన కుర్రాడు కనుక ఉంటే చెప్పండి, కచ్చితంగా అతనితో నేను డేటింగ్ కు వెళ్తా అంటూ’ సమాధానం ఇచ్చింది. గతంలో జ్యోతి ప్రేమ వివాహం చేసుకుని మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో తన భర్తతో విడిపోయింది.పెళ్లి చేసుకుంటే ఇబ్బందులే ఎదురవుతాయి కాబట్టి భవిష్యత్తులో పెళ్లి గురించి ఆలోచించే ప్రశక్తే లేదు’ అంటూ ఈమె తెలియజేసింది. కానీ ఇప్పుడు డేటింగ్ కు రెడీ అంటుంది అంటే మనసు మార్చుకున్నట్లు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus