Actress: బొద్దుగుమ్మ కాస్తా ముద్దుగుమ్మగా మారిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే..?

  • March 30, 2023 / 06:00 PM IST

రీమేక్ చేయాలనుకుంటున్నాడు? సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది.. ఇక స్టార్స్ త్రో బ్యాక్ పిక్స్, రేర్ వీడియోస్ గురించి అయితే చెప్పక్కర్లేదు.. ముఖ్యంగా స్పెషల్ అకేషన్ టైంలో నటీనటుల ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి.. రీసెంట్‌గా యంగ్ స్టార్ హీరోయిన్ అన్ సీన్ పిక్ ఒకటి బయటకొచ్చింది.. ఆమెను చూసి ఫ్యాన్స్, నెటిజన్స్ షాక్ అవుతున్నారు.. అప్పుడు అలా ఉండి.. ఇప్పుడు ఇలా మారిపోయిందా? అంటూ సర్‌ప్రైజ్ అవుతున్నారు..

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే.. కళ్యాణి ప్రియదర్శన్.. మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్‌లోనూ నటించి గుర్తింపుతెచ్చుకుంది.. ఆమె తండ్రి ప్రియదర్శన్.. లెజెండరీ డైరెక్టర్.. మలయాళం, తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలు తెరకెెక్కించారు. నాగార్జున ‘నిర్ణయం’, బాలయ్య ‘గాంఢీవం’ ఆయన తీసినవే. 19990లో నటి లిస్సీని వివాహం చేసుకున్నారు. వీరికి కళ్యాణి, సిద్దార్థ్ సంతానం. 2016లో కొన్ని కారణాల వల్ల విడిపోయారు.

ఇటీవల తమ కుమారుడి వివాహం కోసం కలిశారు. .తల్లిదండ్రులు, అన్న, వదినలతో కలిసున్న (Actress)  కళ్యాణి పిక్ నెట్టింట వైరల్ అయిందప్పుడు.. ఇక కొద్దిరోజుల క్రితం అంటే ఇండస్ట్రీకి ఎంటర్ అవకముందు కళ్యాణి చాలా లావుగా ఉంది.. కళ్లద్దాలు పెట్టుకుని అస్సలు ఏ కోణంలోనూ ఇప్పుడున్న ఆకారంతో పోల్చుకోలేని విధంగా ఉంది.. బహుశా తను కాలేజ్ చదివేటప్పటి పిక్ అనుకుంటా.. ఇక సెలబ్రిటీ కిడ్స్ అందులోనూ అమ్మాయిలు లావుగా ఉంటే భయంకరంగా ట్రోల్ చేస్తుంటారు..

సైఫ్ అలీ ఖాన్ డాటర్ సారా ఖాన్, అర్జున్ కపూర్ సిస్టర్ అన్షులా కపూర్, సోనమ్ కపూర్ వంటి వారిని నెటిజన్లు వారి ఆకారం గురించి బాగా ఏడిపించారు.. దీంతో వారంతా నాజూగ్గా తయారయ్యారు.. కళ్యాణి ప్రియదర్శన్ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందు ఫిజిక్ మీద ఫోకస్ పెట్టి మెరుపుతీగలా మారిపోయింది.. అసలు ఈ ఫోటోలో ఉన్నది కళ్యాణి అంటే నమ్మలేకపోతున్నాం.. నైస్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus