సినిమా ఇండస్ట్రీ గురించి కొంతమంది సినిమా వాళ్లు చేసే కామెంట్స్ వింటుంటే.. నిజమేనా సినిమా పరిశ్రమలో ఇలా ఉంటుందా అనే డౌట్ వస్తూ ఉంటుంది. అది కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంటూనే సినిమా పరిశ్రమ గురించి అలా ఎలా కామెంట్స్ చేస్తారబ్బా అనే డౌట్ కూడా వస్తుంది. తాజాగా ఓ నటి మాటలు ఇలాంటి డౌట్‌నే క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక క్రాఫ్ట్ వ్యక్తులు, వేరే క్రాఫ్ట్ వ్యక్తులను తక్కువగా చూస్తారు అనే అర్థం వచ్చేలా ఆమె కామెంట్ చేశారు కాబట్టి.
ఓటీటీలో విడుదలై భారీ విజయం అందుకున్న చిత్రం ‘మా ఊరి పొలిమేర’. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మా ఊరి పొలిమేర 2’ తెరకెక్కించారు. అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో సత్యం రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబరు 3న విడుదలవుతున్న నేపథ్యంలో నటి కామాక్షి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఇండస్ట్రీ గురించి కామెంట్స్ చేశారు.
నాపై (Kamakshi Bhaskarla) ప్రముఖ రచయిత చలం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నా రచనల్లో ఆయన ప్రభావం ఉంటుంది. నటిగా అన్ని క్రాఫ్ట్‌ల కష్టాన్ని తెలుసుకోవాలని అనుకుంటాను. అలా చేయడం వల్ల సినిమాపై నాకు గౌరవం పెరుగుతుంది అనిపిస్తుంది. అందుకే ఈ సినిమా కోసం సహాయ దర్శకురాలిగానూ మారాను అని కామాక్షి చెప్పింది. ఇండస్ట్రీలో ఒక క్రాఫ్ట్‌లో పని చేసే వారు, వేరే క్రాఫ్ట్‌లో ఉన్న వారిని కొంచెం తక్కువగా చూస్తారు అని చెప్పుకొచ్చింది.
అలా చూసేంత పొగరు తనకు రాకూడదనే వేరే విభాగంలో పని చేయాలని అనుకున్నానని కామాక్షి చెప్పింది. అంతేకాదు ఈ సినిమా కోసం డైలాగులు కూడా రాశాను అని చెప్పింది. అలాగే దర్శకురాలిగానూ చూడొచ్చు అని హింట్ ఇచ్చింది. దీంతో కామాక్షి మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఏ క్రాఫ్ట్‌లో ఎవరు అలా చూస్తున్నారు అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!