జయలలిత బయోపిక్ కోసం బరువు పెరగనంటున్న కంగనా రనౌత్

పాత్ర కోసం ఎలాంటి సాహసాన్నైనే చేసేస్తుంటారు మన నటీనటులు. ఉదాహరణకు అమీర్ ఖాన్ “దంగల్” కోసం ఏకంగా 30 కేజీల బరువు పెరిగి మళ్ళీ తగ్గాడు. కానీ.. తాను త్వరలో పోషించడానికి రెడీ అవుతున్న జయలలిత పాత్ర కోసం మాత్రం చచ్చినా బరువు పెరగను అంటోంది కంగనా. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, మాజీ హీరోయిన్ జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న “తలైవి” అనే చిత్రంలో జయలలిత టైటిల్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

అయితే.. దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ఈ సినిమా కోసం కంగనాను కొంచెం బరువు పెరగమని అడిగాడట. దానికి ఇమ్మీడియట్ గా కంగనా నో చెప్పడమే కాక కావాలంటే ప్రోస్టేటిక్ మేకప్ వాడదామని సలాహా ఇచ్చిందట. దాంతో దర్శకుడు విజయ్ షాకై.. ఏమీ చేయలేని స్థితిలో కంగనా చెప్పినడానికి సరేనన్నాడట. అసలు కంగనాతో ఒక సినిమాలో నటింపజేయడమే ఎక్కువ అనుకుంటే.. అలాంటిది ఇలాంటి ఎక్స్ట్రాలు అడిగితే ఉరుకుంటుందా చెప్పండి. పాపం విజయ్ కి షూటింగ్ మొదలవ్వకముందే కంగనా దెబ్బ తగిలిందన్నమాట. అయినా.. ఇందులో కంగనా భయం కూడా ఉంది లెండి. “సైజ్ జీరో” ముందువరకూ సన్నగా ఉండే అనుష్క ఆ సినిమా కోసం బరువు పెరిగి.. ఆ బరువు మళ్ళీ తగ్గించుకోవడం కోసం పడిన శ్రమ అందరికీ తెలిసిందే. ఆ ఇబ్బంది తాను ఎదుర్కోకూడదనే కంగనా ఈ నిర్ణయం తీసుకొందని సమాచారం

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus