Kaniha: ఈ సీనియర్ హీరోయిన్ ఫోటో చాలా డిస్టర్బింగ్ ఉందిగా.. ఏమైంది..?

ఓ సీనియర్ హీరోయిన్ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది అని చెప్పాలి. ఆ హీరోయిన్ మరెవరో కాదు కనిహ (Kaniha) . శ్రీకాంత్ (Srikanth) హీరోగా తెరకెక్కిన ‘ఒట్టేసి చెబుతున్నా’ (Ottesi Cheputunna) సినిమాతో ఈమె టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ (Ravi Teja) నటించిన ‘నా ఆటోగ్రాఫ్’ (Naa Autograph) సినిమాలో కూడా నటించింది. ఎందుకో ఆ తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో నటించలేదు. తమిళంలో, మలయాళంలో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తుంది.

Kaniha

అయితే ఈమె (Kaniha) లేటెస్ట్ ఫోటో ఒకటి ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ఫోటోని గమనిస్తే.. కనిహ మొహం ఒక సైడ్ మొత్తం కాలిపోయినట్టుగా కనిపిస్తుంది. ఈ ఫోటో చాలా డిస్టర్బింగ్ గా ఉంది అని చెప్పొచ్చు. దీంతో అసలు కనిహాకి ఏమైంది అంటూ కంగారు పడుతున్నారు. కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కనికా ఓ సినిమా కోసం వేసుకున్న మేకప్ ఇది. అవును సినిమాలో పాత్ర డిమాండ్ చేయడంతో ఆమె ఇలా మారింది. అందులో భాగంగానే మొహం కాలిపోయినట్టు కనికా…

ఇలా మేకోవర్ వేసుకోవాల్సి వచ్చింది. విజయ్ (Thalapathy Vijay) హీరోగా వెంకట్ ప్రభు (Venkat Prabhu)   దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) (The Greatest of All Time) గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కనిహ .. అభి అనే పాత్ర పోషించింది. ఒక విధంగా ఇది గెస్ట్ రోల్ అనే చెప్పాలి. ఆ పాత్ర కోసం కనిహ (Kaniha) మేకప్ వేసుకున్నట్టు తెలిపి.. ఈ ఫోటోని షేర్ చేసింది.అలాగే దర్శకుడు వెంకట్ ప్రభుకి కూడా థాంక్స్ అంటూ రాసుకొచ్చింది. ఆమె పోస్ట్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.

కల్కి ఫుల్ రన్ కలెక్షన్లను దేవర, పుష్ప2, గేమ్ ఛేంజర్ బ్రేక్ చేస్తాయా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus