Kasthuri: ఏకంగా ఆ స్టారోనే కెలికిందిగా..నటి కస్తూరి!

  • October 11, 2023 / 04:51 PM IST

ప్రస్తుతం సీరియల్స్‌లో బిజీగా ఉంటూ.. సినిమాలకు దూరంగా ఉంటున్న కస్తూరి.. ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్ ఇస్తూ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నారు. ఇటీవల కావేరి జలాలపై కస్తూరి స్పందించడం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సినిమాల్లో బూతులు మాట్లాడడంపై కూడా తాజాగా స్పందించి మరోసారి సెన్సేషన్ సృష్టించారు. ఈమధ్యకాలంలో సినిమాల్లో కులాల గురించి మాట్లాడడం, బూతులు ఉపయోగించడం కామన్‌గా మారిపోయింది. మామూలుగా బయట ప్రపంచంలో కులాల గురించి ఓపెన్‌గా మాట్లాడడం అభ్యుదయవాదం అని అంటున్నారు.

దీనిపై కస్తూరి (Kasthuri) రియాక్ట్ అయ్యారు. ‘‘ఎక్కడైనా కులం చూడాల్సిన అవసరం లేనప్పుడు సినిమాల్లోనే ఎందుకు? ప్రస్తుతం తమిళ సినిమాల్లో కులాన్ని ఉపయోగించడం ట్రెండ్‌గా మారిపోయింది. నేను వేదికపై కులాల గురించి మాట్లాడడం అభ్యుదయవాదం అని పిలవడం మానేస్తాను. ఆ ధోరణి చాలా తప్పు’’ అని కస్తూరి చెప్పుకొచ్చారు. ఆపై ‘లియో’ ట్రైలర్‌లో విజయ్ మాట్లాడిన బూతు గురించి కూడా కస్తూరి మాట్లాడారు. ‘‘తమిళ సినిమాలో అసభ్యపదజాలం, పరుష పదజాలం ఉపయోగించడం కొత్తేమీ కాదు.

ఎక్కడో ముఖం లేని నటుడు మాట్లాడే మాటలకు, పాన్-ఇండియన్ నటుడు విజయ్ మాట్లాడే మాటలకు చాలా తేడా ఉంది’’ అంటూ తమిళ సినిమాలపై ఓపెన్ కౌంటర్ వేశారు కస్తూరి. పైగా విజయ్ లాంటి హీరో ఓపెన్‌గా అలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. మామూలుగా కోలీవుడ్‌లో విజయ్‌కు యువకులు ఫాలోయింగ్ ఎంత ఉంటుందో.. యువతుల, మహిళల ఫాలోయింగ్ కూడా అంతే ఉంటుంది.

అయితే తమ ఫేవరెట్ హీరో విజయే ఇలాంటి పదాలు ఉపయోగించాడని, తన ఫ్యాన్స్ కూడా అలాంటి పదలు ఉపయోగించడం మొదలుపెడితే బాగుండదు కదా అని కస్తూరి.. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘లియో’లో విజయ్ బూతులు మాట్లాడినందుకే ప్రేక్షకులు రియాక్ట్ అయితే.. ఒకప్పుడు ‘మంగాథ’ చిత్రంలో అజిత్ కూడా ఇలాంటి మాటలే ఉపయోగించారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus