Actress Kavitha: కొడుకు పోయి నెలలు కాకుండానే.. కవిత ఇంట్లో మరో విషాదం..!

ప్రముఖ టాలీవుడ్ నటి కవిత అందరికీ సుపరిచితమే..! తల్లి, అక్క, వదిన వంటి పాత్రల్లో ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడల భాషాల్లో మొత్తం కలిపి 350 కి పైగా సినిమాల్లో నటించారు కవిత. ప్రస్తుతం ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. తమిళంలో ‘ఎండ్రాండ్రం పున్నగై’ అనే ఒక సినిమాలో నటిస్తుంది అంతే..!ఇదిలా ఉండగా..ఇటీవల ఈమె కొడుకు కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే.

ఆ బాధ నుండీ ఈమె పూర్తిగా కోలుకోక ముందే ఈమెకు మరో దెబ్బ పడింది. కవిత కొడుకు మరణించిన టైములో ఈమె భర్త దశరథ రాజు కూడా కరోనాకు గురయ్యి శ్వాస సంబంధిత‌ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆసుపత్రిలో చేరారు. ఆ టైములో ఈయన పరిస్థితి బాగానే ఉంది.. ట్రీట్మెంట్ కు ఈ రెస్పాండ్ అవుతున్నారు అని వైద్యులు తెలిపారు. దీంతో త్వ‌ర‌లోనే దశరథ రాజు కోలుకుంటార‌ని అంతా భావించారు. కానీ ఆయ‌న క‌న్ను మరణించడం అందరినీ కంటతడి పెట్టించే విషయం.

దీంతో కవిత గారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కొన్ని నెలల సమయంలోనే ఆమె భర్త, కొడుకు చనిపోవడాన్ని ఆమె జీర్ణించు కోలేక క్రుంగి పోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఆమెకు అండగా నిలబడి ధైర్యం చెబుతున్నట్టు తెలుస్తుంది. అలాగే దశరథరాజు ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus