బాలీవుడ్ అనే పేరు ఎత్తగనే ఎక్కువగా వినిపించే టాపిక్ నెపోటిజం. అంటే వారసత్వం. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో వచ్చి తమను తాము నిరూపించుకున్నవాళ్లు.. వాళ్ల వారసుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. అందులో కొంతమంది విజయం సాధించగా, మరికొంత సరైన విజయాలు అందుకోలేక చతికిలపడుతుంటారు. అయితే మరికొంతమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి… ఆ తర్వాత బ్యాగ్రౌండ్ సంపాదించుకుంటారు. అలాంటి వారిలో కృతి సనన్ ఒకరు. టాలీవుడ్‌లో కథానాయికగా కెరీర్‌ను ప్రారంభించి, రెండు సినిమాలు చేసి ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయింది కృతి సనన్.
అక్కడ నెపోకిడ్స్‌ను తట్టుకుని మరీ సినిమా ఛాన్స్‌లు సంపాదించింది అని అంటుంటారు. అంతలా తనలో స్పెషాలిటీ ఏముందో మొన్నీమధ్య వచ్చిన జాతీయ ఉత్తమ నటి పురస్కారం చెబుతుంది. అయితే ఆమెను బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాతల అండదండలు ఆమె మీద పుష్కలంగా ఉన్నాయి అని అంటారు. అయితే తాజాగా కృతి సనన్ బాలీవుడ్ మీద చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
బాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల వారసులు ఎవరైనా తెరంగేట్రం చేస్తే వాళ్లకు ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. ఎప్పుడూ సొంత మనుషులకే కాదు, ప్రతిభ ఉన్న వారికి కూడా చోటు కల్పించాలి అని కామెంట్స్ చేసింది. ఈ కామెంట్లు కొత్త కాకపోయినా… అయితే ఇప్పుడు ఎందుకు కామెంట్స్ చేసింది అనేది విషయంగా మారింది. అక్కడితో ఆమె ఆపేయకుంఆ… అందరికీ సమాన అవకాశాలు కల్పించినప్పుడు పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది అని కూడా చెప్పింది.
అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయని చెప్పిన (Kriti Sanon) కృతి సనన్… పెద్ద స్టార్ల కంటే టాలెంట్ ఉన్న వారికే ఇప్పుడు బాలీవుడ్‌లో ఆదరణ దక్కుతోంది అని చెప్పింది. బాలీవుడ్‌లో నెపోటిజం గురించి కృతి మాట్లాడడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇదే తరహాలో స్పందించింది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవకాశాలు నెపోటిజం కారణం వల్ల చేజారిపోయాయని చెప్పింది.