Kriti Sanon, Prabhas: ‘డార్లింగ్’ ప్రభాస్ గురించి కృతి సనన్ ఏం కామెంట్స్ చేసిందో తెలుసా!

కట్టప్ప ‘బాహుబలి’ ని ఎందుకు చంపాడు? అనే దానికి సమాధానం తెలిసింది కానీ.. రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.. 40 ప్లస్ అయినా ఇంకా షాదీ ముచ్చట చెప్పట్లేదని ఎప్పటినుండో వార్తలు వైరల్ అవుతున్నాయి. మీడియా అండ్ సోషల్ మీడియాలో అనుష్కతో స్టార్ట్ చేసి పలువురు మద్దుగుమ్మలతో మనోణ్ణి ముడేశారు. కానీ డార్లింగ్ అలాంటివేమీ పట్టించుకోడు.. వాటి గురించి స్పందించడు.. తన స్టైల్లో ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకుంటాడంతే..

కట్ చేస్తే.. కొద్దిరోజులుగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే న్యూస్ వీలు కుదిరినప్పుడల్లా వైరల్ అవుతూనే ఉంది. దానికి మెయిన్ రీజన్ వీళ్ల ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ.. కృతి, డార్లింగ్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతున్న విధానమే. ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ ‘ఆదిపురుష్’ లో సీతగా కనిపించనుంది కృతి. సినిమా అనౌన్స్‌మెంట్ అప్పుడు.. టీజర్ లాంఛ్ ఈవెంట్‌లో డార్లింగ్ నడవలేని పరిస్థితిలో ఉండగా చెయ్యి అందించడం..

చెమటలు పడితే తన చీర చెంగు అందించడం.. ‘కాఫీ విత్ కరణ్’ షోలో ప్రభాస్‌కి కాల్ చేయడం లాంటి క్యూట్ మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ఇక రీసెంట్‌గా వరుణ్ ధావన్‌తో చేసిన భేడియా (తెలుగులో తోడేలు) ప్రమోషన్స్‌లోనూ మరోసారి ప్రభాస్ జపం చేసి వార్తల్లో నిలిచింది కృతి సనన్. ఈ సందర్భంగా యాంకర్.. ఈ ముగ్గురిలో ఎవరితో ఫ్లర్ట్ చేస్తావ్?, ఎవరిని మ్యారేజ్ చేసుకుంటావ్?, ఎవరితో డేట్ చేస్తావ్? అని మూడు ఆప్షన్ ఇవ్వగా..

కార్తీక్ ఆర్యన్‌తో ఫ్లర్టింగ్, టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ అని చెప్పి.. ఛాన్స్ వస్తే ప్రభాస్‌ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది కృతి.. ఇంకేముంది.. ‘నార్త్ వదిన కన్ఫామ్ అయిపోయిందిరోయ్’ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ వీడియో క్లిప్ షేర్ చేస్తూ నెట్టింట తెగ హంగామా చేస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ‘ఆదిపురుష్’ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus