సుధాకర్ కోసం వచ్చి కూర్చునే కుర్రాడు మెగాస్టార్ అయ్యాడు: సీనియర్ నటి లక్ష్మి ప్రియ

నిన్నటి తరం నటి లక్ష్మి ప్రియ బహుశా ఇప్పటి ఆడియన్స్ కు ఎక్కువ తెలిసుండదు. ఒకప్పటి స్టార్ హీరోలకు ఈమె తల్లి పాత్రల్లో ఎక్కువగా కనిపించేది. తర్వాత తమిళ సినిమాల్లో, సీరియల్స్ లో ఎక్కువగా కనిపించేది. ప్రస్తుతం ఈమె ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గురించి ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

చిరంజీవికి సుధాకర్, ప్రసాద్ బాబు మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. అయితే సుధాకర్, లక్ష్మీ ప్రియ కలిసి ఓ నాటకం కోసం రిహార్సల్స్ చేస్తుంటే అక్కడి చిరంజీవి వచ్చి ఖాళీగా కూర్చునేవారట. ఈ విషయం గురించి ఆమె స్పందిస్తూ .. “నేను ఒక మారుమూల గ్రామం నుండి మద్రాసుకు వెళ్లాను. అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేసేదాన్ని. నేను .. కమెడియన్ సుధాకర్ కలిసి ఒక నాటకం వేయాల్సి ఉంది.

ఆ నాటకంలో నేను అక్క .. ఆయన తమ్ముడు పాత్ర చేయాలి. మేమిద్దరం కలిసి రిహార్సల్ చేస్తుండగా. సుధాకర్ కోసం ఓ వ్యక్తి వచ్చి వెయిట్ చేసేవారు. ఆ నాటకం తర్వాత సుధాకర్ హీరో అయ్యాడు. అయితే కొన్ని రోజుల తరువాత ‘అగ్ని సంస్కారం’ అనే సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం నన్ను తీసుకున్నారు.

జీవీ ప్రభాకర్ గారు దర్శకుడు. ఆ సినిమాలో హీరో చిరంజీవి అంటే నేను షాకయ్యను. ఎందుకంటే నేను, సుధాకర్ నాటకం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు.. సుధాకర్ కోసం వచ్చి ఖాళీగా కూర్చునే కుర్రాడు చిరంజీవే” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus