Lavanya Trapathi: నటి లావణ్య త్రిపాటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదేనా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వరుణ్ తేజ్ చాలా సైలెంట్ గా తన ప్రేమ ప్రయాణాన్ని ఇన్ని రోజులు కొనసాగించారని చెప్పాలి. ఇలా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ప్రకటిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా ప్రేమ విషయాన్ని తెలియజేయడమే కాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అంటూ నిశ్చితార్థపు తేదీని ప్రకటించారు.

మెగా ఇంటికి కోడలుగా అడుగు పెట్టబోతున్నటువంటి లావణ్య త్రిపాఠి కేవలం నటిగా మాత్రమే మనకు తెలుసు.అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్ అంతరిక్షం అనే సినిమాలలో నటించారు. అయితే మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అప్పటినుంచి వీరిద్దరూ రహస్యంగా ప్రేమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

ఇక వరుణ్ తేజ్ లావణ్య (Lavanya Trapathi) పెళ్లి జరగబోతుందని తెలియడంతో చాలామంది అసలు లావణ్య ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. లావణ్య త్రిపాఠి అయోధ్యలో జన్మించారు ఈమె తండ్రి హైకోర్టు న్యాయమూర్తి తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఇక ఈమెకు ఒక చెల్లి తమ్ముడు కూడా ఉన్నారట.చదువుపై ఏ మాత్రం ఆసక్తి లేనటువంటి ఈమె తనకు సినిమాలపై ఆసక్తి ఉందని

సినిమా రంగం వైపు వెళ్తానని చెప్పడంతో తన తండ్రి డిగ్రీ పూర్తి చేసే వరకు ఎటువైపు వెళ్లడానికి వీలు లేదని చెప్పడంతో ముంబైలో ఎకనామిక్స్ లో డిగ్రీ పూర్తి చేశారట. ఇలా డిగ్రీ పూర్తి అయినటువంటి ఈమె మోడలింగ్ వైపు అడుగులు వేశారు. ఇలా మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెల్చుకున్నటువంటి ఈమె అనంతరం అందాల రాక్షసి సినిమా ద్వారా అవకాశాలు అందుకొని తెలుపు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus