సైలెంట్‌గా తమిళ హీరోని పెళ్లిచేసుకున్న మధుశాలిని.. వైరల్ అవుతున్న పెళ్లి ఫోటోలు..!

  • June 17, 2022 / 10:11 PM IST

టాలీవుడ్ హీరోయిన్ మరియు సహాయ నటి అయిన మధుశాలిని సైలెంట్‌గా గా పెళ్లి చేసుకుని అభిమానులని సర్‌ప్రైజ్‌ చేసింది. కోలీవుడ్ హీరో గోకుల్‌ ఆనంద్‌తో మధు శాలిని పెళ్లి గురువారం నాడు హైదరాబాద్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు మరియు కొద్దిపాటి సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. పలువురు సినీ ప్రముఖులు వీరి పెళ్లి వేడుకకు హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. మధు శాలిని, గోకుల్‌ కలిసి ‘పంచాక్షరం’ అనే తమిళ చిత్రంలో నటించారు.

ఈ మూవీ టైములో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది స్నేహంగా మారి ప్రేమకు దారి తీసి చివరికి ఇలా పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది అని స్పష్టమవుతుంది.మెగాస్టార్ చిరంజీవి-శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘అందరివాడు’ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది మధుశాలిని. అటు తర్వాత ‘కితకితలు’ ‘అనుక్షణం’ ‘గోపాల గోపాల’ ‘గూఢచారి’ వంటి చిత్రాల్లో నటించింది. ఈమె వయసు ఇప్పుడు 33 ఏళ్ళు. ఇక మధుశాలిని- గోకుల్ ల పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus