‘అమ్మాయి కాపురం’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ మహేశ్వరి. అటు తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబి’ చిత్రంతో ఈమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అటు తర్వాత ‘ఖైదీ ఇన్స్పెక్టర్’ ‘దెయ్యం’ ‘మృగం’ ‘జాబిలమ్మ పెళ్ళి’ ‘ప్రియరాగాలు’ ‘పెళ్లి’ ‘మా బాలాజి’ ‘నీ కోసం’ ‘మా అన్నయ్య’ ‘తిరుమల తిరుపతి వెంకటేష’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తమిళంలో అజిత్ నటించిన ‘ఉల్లాసం’ చిత్రంలో కూడా నటించింది.
కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైములో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన జయకృష్ణను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది మహేశ్వరి. అటు తర్వాత 2008 లో ‘మై నేమ్ ఈజ్ మంగతాయారు’ అనే సీరియల్ తో రీ ఎంట్రీ ఇచ్చింది కానీ ఆ సీరియల్ ఈమెకు కలిసి రాలేదు అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈమె మన అతిలోక సుందరి శ్రీదేవికి దగ్గర బంధువు అన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. శ్రీదేవికి కజిన్ అయిన సూర్యకళ కుమార్తె నే మన మహేశ్వరి.
ఈమె కెరీర్ ప్రారంభించినప్పుడు శ్రీదేవి రిఫరెన్స్ ను వాడుకోవడానికి ఈమె ఇష్టపడేది కాదట. కానీ దర్శకనిర్మాతలు, కుటుంబ సభ్యుల సలహా మేరకు ఈమె నటించిన సినిమాల వేడుకలకు శ్రీదేవిని ఆహ్వానించింది. ఈమె సీరియల్ తో రీ ఎంట్రీ ఇచ్చిన సమయంలో కూడా శ్రీదేవి.. మహేశ్వరి కి బాగా సాయం చేశారు. ఇదిలా ఉండగా.. మంచి పాత్ర దొరికితే మళ్ళీ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తానని ఈమె చెబుతుంది.1977 వ సంవత్సరం ఆగస్టు 26 న ఈమె జన్మించింది. అంటే ఈరోజుతో ఈమె 44 వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందన్న మాట.