మాలాశ్రీ… నిన్నటి తరం సినిమా అభిమానులకు ఈ పేరు బాగా సుపరిచితం. గ్లామర్ పాత్రలు చేయాలన్నా, పోలీసు పాత్రలు చేయాలన్నా, మగరాయుడిలా కనిపించాలన్నా ఈమే అనేవారు దర్శకనిర్మాతలు. అందుకే వరుసగా ఇలాంటి పాత్రలు చేస్తూ మెప్పించింది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న సయమంలోనే సినిమాల నుండి తప్పుకుంది. ఆ తర్వాత పెద్దగా ఎవరికీ కనిపించింది లేదు. ఇటీవల కరోనా కారణంగా ఆమె భర్త మరణించారు. అసలేమైంది అనే విషయాలు ఆమె ఇటీవల చెప్పుకొచ్చారు.
మీ భర్త రాము ఎలా చనిపోయారు అని అడిగితే… మాలాశ్రీ అంతా ఐదురోజుల్లో జరిగిపోయింది. ఏమయ్యిందో తెలియదు అని చెప్పారు. ఆయన ఎప్పుడూ ఒంట్లో బాగోలేకపోతే చెప్పరట. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని ఇప్పుడు అంతా ఓకే అంటారట. అలాంటి ఆయన ఓ రోజు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదు, ఫ్యామిలీ డాక్టర్‌ను పిలవమన్నారట. ఆ సమయంలో దేశంలో కొవిడ్ సెకండ్‌వేవ్ ఉద్ధృతంగా ఉందట. దీంతో డాక్టర్ మాలాశ్రీ భర్తకు కొవిడ్ పరీక్ష చేయించమన్నారట. చేసి చూస్తే… పరీక్షలో పాజిటివ్ వచ్చిందట.
ఈలోగా రాముకు దగ్గు మొదలైంది. మందులు వేసుకోవడం మొదలెట్టినా నయమవ్వడంలేదట. అ తర్వాత వాంతులు మొదలయ్యాయి. దీంతో ఆసుపత్రిలో చేర్చించక తప్పదు అని డాక్టర్ చెప్పారట. అయితే మాలాశ్రీ భర్తకు ఆసుపత్రి అంటే అస్సలు పడదట. దీంతో ఆయనను ఒప్పించి ఆసుపత్రిలో ప్రత్యేక గదిలో చేర్పించారట. కానీ అప్పటికే ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం ప్రారంభమైందట. దీంతో తర్వాతి రోజు ఐసీయూలోకి మార్చారట. అక్కడికి రెండోరోజు రాము చనిపోయారు. చనిపోయే ముందు రోజు రాము…
మాలాశ్రీకి రాత్రి ఫోన్ చేసి ముందు బెడ్‌పై ఒకరు, పక్కన మరొకరు చనిపోయారు. నేను ఇక్కడ ఉండలేను. నన్ను డిశ్చార్జి చేయమని చెప్పవా అని అడిగారట. అయితే మాలాశ్రీ ఆయనతో… ఈ జబ్బుతో ధైర్యంగా పోరాడు. భయం వద్దు అని చెప్పారట. వైద్యులు చెప్పినట్టు విను… నువ్వు ఇంటికి రావాలి అని ఆమె అన్నారట. అయితే ఆ భయంతోనే ఆయన చనిపోయారట. కరోనా కంటే ఆ భయమే ఎక్కువ చంపేస్తుందని వైద్యులు చెప్పేవారనే విషయం తెలిసిందే.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!