Mani Chandana: సీనియర్ నటి మణి చందన పెళ్లి ఫోటోలు వైరల్.!

  • June 22, 2024 / 05:02 PM IST

సీనియర్ నటి మణిచందన అందరికీ సుపరిచితమే. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సూపర్ హిట్ మూవీ ‘తొలిప్రేమ’ (Tholi Prema) ద్వారా ఈమె నటిగా మారింది. ఆ తర్వాత ‘పిల్లనచ్చింది’ ‘పెళ్ళాం వచ్చింది’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. అంతేకాదు రవితేజ (Ravi Teja) హీరోగా తెరకెక్కిన ‘మనసిచ్చాను’ సినిమాలో ఈమె హీరోయిన్ గా కూడా నటించింది. అటు తర్వాత ‘నిజం’ (Nijam) ‘ఉంగరాల రాంబాబు’ ‘నాంది’ వంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు కూడా ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) ‘దేవర’ (Devara) వంటి పెద్ద సినిమాల్లో నటిస్తోంది.

ఈమె చూడటానికి స్టార్ హీరోయిన్ ఖుష్బూలా (Khushbu) ఉంటుందని చాలా మంది అంటుంటారు.తమిళంలో కూడా ఈమె సినిమాలు చేయడంతో ఆ పేరు వచ్చింది అని చెప్పొచ్చు. అందుకే ఈమెకి టాలీవుడ్లో జూనియర్ ఖుష్బూ అనే పేరు కూడా ఉంది. ఇదిలా ఉండగా.. ఈరోజు మణిచందన దంపతుల 17వ పెళ్లిరోజుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది మణిచందన.

అలాగే తన భర్తతో కలిసున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అంతేకాదు తన పెళ్లి రోజు ఫోటోలు కూడా షేర్ చేసింది. 2007 లో ఈమె వివాహం జరిగింది. ఈమె సొంత ఊరు గుంటూరు. పెద్దలు కుదిర్చిన వివాహమే ఈమె చేసుకుంది. మణిచందనకి ఓ కూతురు కూడా ఉంది. ఈ విషయాలు పక్కన పెట్టేసి.. మణిచందన పెళ్లి ఫోటోలు అలాగే ఆమె భర్తతో కలిసున్న రొమాంటిక్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus