Meena: ఆ హీరోయిన్ పాదాలకు దండం పెట్టొచ్చు: మీనా

సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి మీనా ఒకరు. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె అనంతరం హీరోయిన్ గా కూడా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన తర్వాత మీనా సినిమాలను కాస్త తగ్గించారు. ఇటీవల మీనా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల తమిళ షోలో పాల్గొన్నటువంటి ఈమెకు హీరోయిన్స్ బోల్డ్ అలాగే బికినీ సన్నివేశాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇలాంటి సన్నివేశాల గురించి ఈమె మాట్లాడుతూ.. చాలామంది నన్ను అడుగుతూ మీరు ఎక్కువగా గ్లామరస్ రోల్ చేయరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి రోల్ చేస్తున్నారు.

మీరు ఎందుకు చేయకూడదు అంటూ నన్ను ప్రశ్నించేవారని తెలిపారు. ఇలాంటి సన్నివేశాలలో నటించాలని నాకు ప్రభుదేవా సలహా ఇచ్చారని మీనా తెలిపారు. అయితే ఆయనతో నటించిన సినిమాలోనే నాకు స్విమ్ సూట్ వేసుకొని అవకాశం వచ్చిందని తెలిపారు. స్విమ్ సూట్ వేసుకుని ఒక సీన్ చేయాల్సి ఉండేదని అయితే ఆ డ్రెస్ వేసుకొని నేను గది నుంచి బయటకు రావడానికి కూడా ఎంతో భయపడిపోయానని ఈమె తెలియచేశారు.

ఆ పరిస్థితుల నుంచి తాను ఎలా బయటపడతానని అప్పుడు చాలా భయపడ్డానని (Meena) ఈమె తెలిపారు. కానీ చాలామంది హీరోయిన్స్ స్విమ్ సూట్ వేసుకొని బికినీ వేసుకొని నటిస్తూ ఉంటారు. వాళ్ల కాళ్లకు దండం పెట్టొచ్చు అంటూ ఈ సందర్భంగా మీనా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags