సినిమా ఇండస్ట్రీలో మగవాడి ఆశలకు లొంగితేనే అవకాశాలు వస్తాయని.. అందుకే ఇతర రాష్ట్రాల వారు విజయాలు సాధిస్తున్నారని నటి మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గత వారమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఏడు సెక్షన్ల కింద ఆమె మీద కేసులు నమోదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో గురువారం నాడు ఆమె విడుదల చేసిన వీడియో వైరల్ గా మారడమే కాదు.. వివాదాన్ని రేపుతోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన నటీమణుల్ని అడ్డేసిన ఆమె చేసిన వ్యాఖ్యలను చాలా మంది ఖండిస్తున్నారు.
ముందుగా ఆ వీడియోలో ప్రధాని నరేంద్రమోదీ, సీఎం ఎంకే స్టాలిన్ లకు విజ్ఞప్తి చేస్తూ.. తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. తమిళనాడు బిడ్డగా, ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళనైన తను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తానేం చేసినా.. ఏం చెప్పినా వివాదం చేస్తున్నారని చెప్పుకొచ్చింది. తనను వేధించిన ఒక్క వ్యక్తిని ఉద్దేశించి స్పష్టంగా వ్యాఖ్యలు చేస్తే.. దాన్ని ఓ సామాజిక వర్గాన్ని కించపరిచినట్లుగా చిత్రీకరించారని వివరించారు.
తనకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాల్ని అడ్డుకోవాలని.. దీనికి ముగింపు పలకడానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అలానే పోలీసులను ఉద్దేశించి మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా.. అసభ్య పదజాలంతో సామాజిక వేదికగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని.. పోలీసులు వాటిపై ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించింది. తను చేసిన వ్యాఖ్యలను బూతద్దంలో చూసి వివాదంగా మార్చిన వారికి సపోర్ట్ చేస్తూ కేసులు పెట్టారని మండిపడింది. ఒక ఆడదానిపై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడి గురించి వారు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించింది.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!