Mrunal Thakur: నా ఇంటి అడ్రస్ చెప్పండి.. నేను ఇంటికి చూస్తా!

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్.మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు. ఇలా తనకు టాలీవుడ్ అవకాశాలు రావడంతో ఈమె హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తరచూ సినిమా షూటింగ్ ల కోసం హైదరాబాద్ రావడం చేత ఈమె హైదరాబాదులో ఏకంగా ఇల్లు కొన్నారని వార్తలు వచ్చాయి.

ఇలా హైదరాబాదులో (Mrunal Thakur) మృణాల్ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే తాజాగా ఈ వార్తలపై నటి స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఈ సందర్భంగా తన గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందించిన ఈమె అడ్రస్ చెప్తే నా ఇంటికి నేను కూడా వస్తాను అంటూ కామెంట్ చేశారు. ఇలా తన ఇంటి అడ్రస్ చెప్తే తన ఇంటికి చూస్తానంటూ ఈమె ఈ వార్తలపై స్పందించడంతో ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలిసిపోతుంది.

హైదరాబాద్ లాంటి ప్లేసులో సెటిల్ అవ్వాలని ఎవరైతే కోరుకోరు అంటూ కూడా ఈమె కామెంట్ చేశారు. అయితే మృణాల్ కామెంట్స్ చూస్తే ప్రస్తుతం అయితే ఈమె హైదరాబాదులో ఇల్లు కొనలేదని కానీ భవిష్యత్తులో కొనే ఆలోచనలో మాత్రం ఉందని స్పష్టం అవుతుంది. ఇక ఈమె ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పనులతో ఈమె ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమానే కాకుండా ఇతర సినిమా కథలను కూడా వింటున్నట్టు సమాచారం. సీతారామం సినిమాతో తెలుగులో ఓవర్ నైట్ స్టార్ అయినటువంటి మృణాల్ కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పాలి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus