Namitha: రాజకీయాలలోకి రావాలని ఉంది.. పొలిటికల్ ఎంట్రీ పై నమిత కామెంట్స్?

తెలుగు చిత్ర పరిశ్రమకు సొంతం సినిమా ద్వారా పరిచయమైన ఎన్నో తెలుగు తమిళ కన్నడ సినిమాలలో నటించి నమిత మంచి గుర్తింపు పొందారు. ఇలా ఇండస్ట్రీలో పలు భాషలలో హీరోయిన్ గా నటించి గుర్తింపు పొందిన ఈమె వీరేంద్రనాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇకపోతే తాజాగా నమిత పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే నమిత తన భర్త పిల్లలతో కలిసి నేడు ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇలా నమిత దంపతులకు ఆలయ పండితులు సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అనంతరం నమిత దంపతులు ఆలయం వెలుపల సందడి చేశారు.

ఈ క్రమంలోనే నమిత మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నమిత మాట్లాడుతూ ప్రస్తుతం తనకు సినిమాలపై కన్నా రాజకీయాలపై ఎంతో ఆసక్తి కలిగిందని, సరైన సమయం చూసుకొని తాను కూడా రాజకీయాలలోకి అడుగు పెడతానంటూ ఈమె రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ విధంగా ఈమె రాజకీయాల గురించి మాట్లాడటంతో పెద్ద ఎత్తున ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ నమిత రాజకీయాలలోకి వస్తే ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు. ఏ పార్టీ తరఫున ఈమె రాజకీయాలలోకి అడుగు పెడతారు అనే విషయంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus