Namitha: నమితకు సీమంతం చేసిన కుటుంబ సభ్యులు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సొంతం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది న‌మిత‌.అటు తర్వాత ‘జెమిని’ ‘ఒక రాజు ఒక రాణి’ ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు పెళ్లి’ ‘ఐతే ఏంటి’ ‘నాయకుడు’ ‘బిల్లా’ ‘సింహా’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. కానీ ఇక్కడ స్టార్ గా ఎదగలేక పోయింది. దాంతో కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి అడపా దడపా సినిమాలు చేసింది కానీ అక్కడ కూడా స్టార్ గా ఎదగలేక పోయింది. తర్వాత విపరీతంగా వెయిట్ పెరగడంతో ఈమెకు అవకాశాలు కూడా కరువయ్యాయి.

దీంతో కోలీవుడ్ యాక్ట‌ర్ వీరేంద్ర చౌద‌రిని 2017లో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఈ మధ్యనే తల్లి కాబోతున్నట్లు కూడా ప్రకటించింది . బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసింది. 41 ఏళ్లలో నమిత తల్లి కాబోతున్న సంగతి తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘నా జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది. మాతృత్వం అనేది మ‌ర‌చిపోలేని గొప్ప అనుభూతి.ఇప్పుడు నా మోహంలో అసలైన చిరున‌వ్వు వ‌చ్చింది. నాలో చాలా మార్పు మొద‌లైంది. ఇలాంటి రోజు కోసం చాలా రోజులు ఎదురు చూశాను.

కొత్త పిలుపులు, కొత్త జీవితం. చిన్నారి కిక్స్ నాకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. గతంలో ఇలాంటిది ఎన్నడూ లేదు’’ అంటూ న‌మిత చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఈమెకు సీమంతం కూడా జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో నమితకు సీమంతం వేడుకలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

More

1

2

3

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus