సొంతం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ నమిత. మొదట్లో నాజూకుగా దర్శనమిచ్చిన ఈ బ్యూటీ కొన్నాళ్లకు చబ్బీ హీరోయిన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. లావైనా కూడా అమ్మడికి అవకాశాలు ఏమి తగ్గలేదు. అదొక రకమైన అందం అన్నట్లు ఆమెకు అభిమానులు పెరగడంతో బిల్లా లాంటి సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తమిళ్ లో కొన్నాళ్ల పాటు బాగా బిజీగా ఉన్న నమిత పెళ్లి అనంతరం సినిమాలకు కొంత దూరమయ్యింది.
ఇక ఆమె దురమైనప్పటికి మధ్యమధ్యలో ఎవరో ఒకరు సినిమాల్లోకి లాగేస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త తరహా వ్యాపారం స్టార్ట్ చేయడానికి సిద్ధమైంది. వెబ్ కంటెంట్ కు ఆదరణ ఎక్కువవుతున్న తరుణంలో ప్రత్యేకంగా ఒక ప్రొడక్షన్ ను స్టార్ట్ చేసింది. యూనిక్ కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకొని వెబ్ సిరీస్ లను అలాగే వెబ్ సినిమాలను రూపొందించడానికి రెడీ అవుతోంది.
నమిత థియేటర్ అని ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ను సిద్ధం చేసి అందులోనే సొంతంగా సినిమాలను రిలీజ్ చేయాలని చూస్తోంది. అలాగే ఇతరులు మంచి కంటెంట్ తో వస్తే వారికి కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతామని ఈ తరహాలో ఆలోచించారట. మరి అమ్మడి ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!