సన్నబడ్డ నమిత.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

  • February 2, 2021 / 02:33 PM IST

శ్రీనువైట్ల డైరెక్షన్లో తెరకెక్కిన ‘సొంతం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నమిత అందరికీ సుపరిచితమే..! అటు తర్వాత ఈమె రవితేజ,వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు రాజశేఖర్,శ్రీకాంత్ వంటి అప్పటి క్రేజీ హీరోల సినిమాల్లో కూడా నటించింది.అదే సమయంలో తమిళం, మలయాళం,హిందీ, కన్నడ సినిమాల్లో కూడా నటించింది. అయితే కొన్నాళ్ల తరువాత ఈమె భారీగా బరువు పెరిగింది. అయినప్పటికీ ఈమె అడపా దడపా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ‘బిల్లా’ ‘సింహా’ వంటి హిట్ సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది.

2017 లో ఈమె వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయినప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇప్పడు కూడా ఈ బ్యూటీ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రం కథంతా ఓ కుక్క చుట్టూ తిరుగుతోంది. ఈ చిత్రం కోసం నమిత జిమ్లో భారీగా వర్కౌట్లు చేసి సన్నపడుతోంది. బాలీవుడ్ హీరోయిన్ల మాదిరి సైజు జీరో ట్రై చెయ్యడమే ఇప్పుడు నమిత లక్ష్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ చిత్రంలో ఫైట్లు కూడా చెయ్యాల్సి ఉందట.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల తన సోషల్ మీడియాలో.. తన భర్త వీరేంద్ర చౌదరి గురించి కూడా కొన్ని కామెంట్లు కూడా చేసింది నమిత. ‘భార్య భర్తల మధ్య సంబంధం అంటే Psychological అని చెప్పుకొచ్చింది నమిత. భార్యా భర్తల్లో ఒకరు Psycho, మరొకరు logical అంటూ విచిత్రంగా కామెంట్ పెట్టింది. అయితే ఎవరు సైకో, ఎవరు లాజికల్ అనేది మాత్రం నన్ను అడగొద్దని ఈమె తెలపడం విశేషం.


1

2

3

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus