‘బిగ్ బాస్’ నందినీ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ .. ఇటీవల సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. డిప్రెషన్ కు లోనవ్వడం వలనే ఇతను సూసైడ్ చేసుకున్నట్టు.. ఇతని సన్నిహితులు, వైద్యులు నిర్ధారించారు. అయితే ‘ఎన్ని బాధలు ఉన్నా.. సూసైడ్ చేసుకోవడం అనేది పర్మినెంట్ సొల్యూషన్ కాదు’ అని సుశాంత్ నటించిన ‘చిచోరే’ చిత్రంలో చెప్పుకొచ్చాడు. ఇదే డైలాగ్ ను గుర్తుచేసుకుని మరీ బాధ పడుతున్నారు నెటిజన్లు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ విషయం పై స్పందించి.. ‘మేము కూడా డిప్రెషన్ కు గురయ్యామని’.. వారు తమ అనుభవాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు.

తాజాగా ఈ లిస్ట్ లో ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ కూడా జాయిన్ అయ్యింది. తెలుగు ‘బిగ్ బాస్2’లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న నందినీ రాయ్.. అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె హీరో సుధీర్ బాబుతో ‘మోసగాళ్లకు మోసగాడు’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. 2015 లో రిలీజ్ అయిన ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది.. దాంతో ఈమెకు అవకాశాలు రాలేదు.

ఆ కారణంగా డిప్రెషన్ కు లోనయ్యి నందినీ ఆత్మ హత్య చేసుకోవాలనుకుందట. ఆ టైములో ‘ధైర్యం కోల్పోకుండా పోరాడి దాని నుండీ కోలుకోగలిగాను’ అంటూ నందినీ రాయ్ చెప్పుకొచ్చింది. ఇక చూడటానికి ఎంతో గ్లామర్ గా ఉండే నందినీకి అవకాశాలు ఎందుకు రావడం లేదు? అనే అనుమానం అందరిలోనూ ఉంది. ఈమె ఇటీవల తన బికినీ ఫోటోలను కూడా షేర్ చేసి అందరికీ షాకిచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus