ఒక హిట్టు పడితే ఎవరి రేంజ్ అయినా మారుతుంది. ముఖ్యంగా హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉన్న టాలీవుడ్లో.. ఏ హీరోయిన్ అయినా ఓ హిట్టు కొట్టింది వాళ్ల రేంజ్ మారుతుంది. అప్పుడు పారితోషికం కూడా పెరుగుతుంది. ఇందులో లాజిక్ ఉంది. నిజం కూడా..! అయితే పారితోషికం పెంచారట కదా అంటే.. ఏ హీరోయిన్ కూడా నిజమని ఒప్పుకోదు. ‘అందులో నిజం లేదు. మేకర్స్ ఎంతిస్తే అంతే తీసుకుంటున్నాను’ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తుంటారు.
కానీ నేహా శెట్టి (Neha Shetty) మాత్రం జెన్యూన్ గా మాట్లాడింది. ఆమె నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) సినిమా మే 31 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో నేహాశెట్టికి.. ‘పారితోషికం పెంచేశారట కదా?’ అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆమె.. ‘ అందులో తప్పేముంది. నిజమే..! మేము ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళాము అని చెప్పడానికి పారితోషికం పెరగడం అనేది ముఖ్యం.
ఉద్యోగంలో అయినా సరే ఎవరికైనా ప్రమోషన్ వస్తేనే కదా.. జీతం పెరుగుతుంది. మా పరిస్థితి కూడా అంతే..! మాకు సక్సెస్ వస్తే… నిర్మాతలకు కూడా మా నమ్మకం పెరుగుతుంది. పారితోషికం పెరుగుదల అనేది మాకు ఇచ్చే గౌరవంగా మేము భావిస్తాము’ అంటూ హానెస్ట్ అండ్ జెన్యూన్ ఆన్సర్ ఇచ్చింది. ‘డీజే టిల్లు’ తో (Dj Tillu) నేహా శెట్టి రేంజ్ పెరిగింది. ఆ తర్వాత ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012) ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann) వంటి సినిమాల్లో కూడా ఈమె నటించింది.